సోషల్ మీడియాపై ఈసీ స్పెషల్ నజర్

EC Special Focus On Social Media,EC Focus,EC Needs A Smart Focus,Election Commission Special Focus On Social Media,Mango News,Mango News Telugu,Election Commission Of India,Central Election Commission Special Focus On Social Media,Election Commission Focus On Social Media,Election Commission Latest News,Election Commission Latest News And Updates,Social Media As Election Campaign,Social Media And Elections,Commission Social Media In Election

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా.. సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టనుంది.ముఖ్యంగా తెలంగాణ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వింగ్ ఏర్పాటుకు సిద్ధం అవుతోంది.

అన్ని పొలిటికల్ పార్టీల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌తో పాటు, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌పైనా ప్రత్యేక నిఘా ఉంచింది. గూగుల్, ఫేస్ బుక్, ఎక్స్(ట్విటర్),ఇన్ స్టాగ్రామ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో ఇప్పటికే సీఎస్‌సీ చర్చలు జరిపింది. అంతేకాదు ఇప్పటికే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించేలా.. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతూ, ఇతర వర్గాలను కించపరుస్తూ చేసే పోస్ట్‌లను వివిధ వెబ్ సైట్ల ద్వారా స్కాన్ చేశారు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఎలాంటివారిపైన అయినా కఠినమైన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరిస్తోంది. తప్పుడు సమాచారం‌తో కూడిన ఎస్ఎమ్మెస్‌లు ,ఎన్నికల ప్రచారం వంటి బల్క్ ఎస్ఎమ్మెస్‌లు చేసినా, వదంతులను ప్రచారం చేసినా తాము డేగ కన్నుతో చూస్తామని చెబుతోంది. ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు సాధారణమే అయినా అవి మితిమీరి ఉంటే చర్యలు తీసుకుంటామని ఈసీ అంటోంది.

మరోవైపు ఎన్నికల కోడ్ అమలు ఉండటంతో.. తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎక్కడికక్కడ అనుమానంగా అనిపించిన వాహనాలను పోలీసులు ఆపి మరీ సోదాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.5 కోట్లకు పైగా డబ్బులను సీజ్ చేశారు.

తాజాగా సికింద్రాబాద్ లో రూ.50 లక్షలతో పాటు, బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు పట్టుకున్నారు. వీటితో పాటు రూ.12.15 లక్షల విలువైన మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే సంగారెడ్డి జిల్లాలో రూ.9.4 లక్షల నగదు, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో రూ.6.50 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు.

అంతేకాకుండా నిజామాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు సమీపంలో రూ.5.60 లక్షల నగదును, పెద్దపల్లి జిల్లాలో రూ.3లక్షలను, వనపర్తి జిల్లా కొత్తకోటలో రూ.2.35 లక్షల నగదుతో పాటు..మహబూబ్ నగర్ జిల్లాలో రూ.2 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇలాంటి లెక్కలు లేని డబ్బులు మరింతగా పట్టుబడతాయని పోలీసులు భావిస్తున్నారు. ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇలాంటి తనిఖీలను మరింత విస్తృతం చేస్తామని పోలీసులు చెబుతున్నారు.దీంతో పాటు సోషల్ మీడియాపై 24బై7 దృష్టి పెడతామని అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + thirteen =