బాబా సాహెబ్ అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

AP CM YS Jagan Pays Tributes To Dr Ambedkar on The Occasion of His Birth Anniversary, Chief Minister YS Jagan Mohan Reddy paid tribute to Dr Baba Saheb Ambedkar on his 131st birth anniversary, Dr Baba Saheb Ambedkar on his 131st birth anniversary, Dr Baba Saheb Ambedkar birth anniversary, 131st birth anniversary, Dr Baba Saheb Ambedkar, AP CM YS Jagan Pays Tributes To Dr Ambedkar, Minister Adimulapu Suresh, Minister of Municipal Administration and Urban Development, Adimulapu Suresh Minister of Municipal Administration and Urban Development, Urban Development Minister, Ambedkar 131st birth anniversary, Ambedkar birth anniversary News, Ambedkar birth anniversary Latest News, Ambedkar birth anniversary Latest Updates, Ambedkar birth anniversary Live Updates, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, YS Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

డాక్టర్‌ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి సీఎం వైఎస్‌ జగన్ నివాళులర్పించారు. నవభారత అభివృద్ధికి బాటలు వేసిన దార్శనికుడు అంబేద్కర్ అని ఈ సందర్భంగా సీఎం జగన్ కొనియాడారు. ఉత్తమ రాజ్యాంగాన్ని అందించిన సమానత్వ పోరాటానికి కారణమైన అంబేద్కర్ అని, అంబేద్కర్ జయంతి సందర్భంగా నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నానని ఆయన తెలిపారు. రాజ్యాంగానికి ప్రతి రూపం బాబా సాహెబ్ అంబేద్కర్‌. అణగారిన వర్గాలకు ఆశాదీపం ఆయన. ఆయన భావాలకు మరణం లేదు. 100 ఏళ్లకుపైగా భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న ఆ మహానుభావుడికి, ఆ మహాశక్తికి, ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 131వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలకు పిలుపునిచ్చారు. బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను సీఎం జగన్ కొనియాడారు. సమాజంలోని అసమానతలను తొలగించేందుకు అంబేద్కర్ ఆశయాలను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. కాగా వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో అంబేద్కర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్‌, మేరుగ నాగార్జున, పినేపే విశ్వరూప్‌, ఎంపీ నందిగం సురేష్, జూపూడి ప్రభాకర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − eleven =