అంత‌ర్జాతీయ వేదిక‌పై దేశ ఖ్యాతిని చాటిన రెజ‌ర్ల‌కు ప్ర‌తి ఒక్కరూ మ‌ద్ద‌తుగా నిల‌వాలి – మంత్రి కేటీఆర్

Minister KTR Slams Union Govt Over Detaining of Protesting Wrestlers at Jantar Mantar Delhi,Minister KTR Slams Union Govt,Detaining of Protesting Wrestlers,Wrestlers at Jantar Mantar Delhi,KTR Slams Union Govt Over Wrestlers Protest,Mango News,Mango News Telugu,Delhi Police Detains Wrestlers,Police detain protesting wrestlers,Indian Olympic wrestlers,Wrestlers protest in Delhi,Wrestlers Manhandled,Protesting wrestlers manhandled,Wrestlers Protest Latest news,Wrestlers Protest Latest Updates,Wrestlers Protest Live News,2023 Indian wrestlers protest,Wrestlers Manhandled Latest News,Wrestlers Manhandled News Today,Wrestlers protest live updates,Minister KTR Latest News,Minister KTR Latest Updates

ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నెలరోజులకు పైగా ఆందోళ‌న చేస్తున్న భారత రెజ‌ర్ల‌కు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు మ‌ద్ద‌తుగా నిలిచారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విట్టర్ వేదికగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రెజ‌ర్ల‌ పట్ల ఢిల్లీ పోలీసుల తీరును ఖండించిన మంత్రి కేటీఆర్.. అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని చాటిన రెజర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. ఈ కఠిన సమయంలో దేశ ప్రజలు రెజర్లకు మద్దతుగా నిలవాలని, వారిని మనమందరం గౌరవించాలని మంత్రి కేటీఆర్ పిలునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం ఢిల్లీ పోలీసులు రెజర్లను బలవంతంగా అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో రెజ్లర్లు వారిని ప్రతిఘటిస్తున్న వీడియోను ఆయన తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.

కాగా, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ తమను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ, ఆయనను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ రెజ‌ర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల రోజులకు పైగా నిరసనలు చేస్తున్న రెజ్లర్లపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ప్రత్యేక బలగాలు కఠినంగా వ్యవహరించాయి. ప్రధాని మోదీ ఆదివారం కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించిన సందర్భంగా రెజ్లర్లు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కొత్త పార్లమెంట్ వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన రెజ్లర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ప్రముఖ రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా సహా మరికొందరు నిరసనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. రెజ్లర్లపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here