ఐపీఎల్ ఫైనల్‌కు వరుణుడి ముప్పు, నేడు కూడా వర్షం పడే అవకాశం.. మ్యాచ్ రద్దయితే, విజేత ఎవరంటే..?

IPL 2023 Final What Happens If Reserve Day Match Washed Out Due To Rain Chennai or Gujarat Who Will Win The Title,IPL 2023 Final,What Happens If Reserve Day Match Washed Out,Due To Rain Chennai or Gujarat Who Will Win,IPL 2023 Who Will Win The Title,Mango News,Mango News Telugu,IPL 2023,IPL 2023 Chennai Super Kings Latest News,Gujarat Titans Latest News,IPL 2023 Reserve Day Match,Chennai or Gujarat,IPL 2023 Latest News and Updates,IPL 2023 Runner up,IPL 2023 Winning Team,Indian Premier League Official

గత రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తుది అంకానికి చేరుకుంది. ఆదివారం ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మరియు డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ అనూహ్యంగా వర్షం కారణంగా రద్దయింది. కనీసం ఐదేసి ఓవర్ల చొప్పున అయినా ఆడించి విజేతను ప్రకటించాలని ఐపీఎల్ యాజమాన్యం భావించింది. అయితే వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దయింది. దీంతో వేలాదిగా స్టేడియంకు తరలివచ్చిన ప్రేక్షకులు నిరాశగా వెనుదిరిగారు. కాగా బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం రిజర్వ్ డేగా సోమవారం రోజును (మే 29, 2023) ప్రకటించడంతో మ్యాచ్ నేటికి వాయిదా పడింది.

ఒకవైపు అనుభవజ్ఞుడైన మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై రికార్డు స్థాయిలో 10వ ఐపీఎల్ ఫైనల్ ఆడుతూ ఐదో టైటిల్ కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ వరుసగా రెండో ఐపీఎల్ ఫైనల్‌లోకి ప్రవేశించి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. దీంతో రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు కొనసాగనుంది. ఇక రిజర్వ్ డే రోజున (సోమవారం, మే 29, 2023) రీషెడ్యూల్ చేయబడిన ఫైనల్ స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవనుంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ అయినా సవ్యంగా సాగుతుందా? అని క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈరోజు కూడా అహ్మదాబాద్‌లో వర్షం పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో నేటి మ్యాచ్‌పై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. మ్యాచ్ జరిగేదీ, లేనిదీ అనుమానాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచ్ కూడా వర్షం వలన రద్దయితే పరిస్థితి ఏంటనే అనుమానాలు అందరిలో మొదలయ్యాయి.

ఒకవేళ వర్షం కారణంగా నేడు కూడా ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్ రద్దయితే.. ఏం జరుగుతుంది?

  • ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్ నిర్వహించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తారు.
  • వర్షం వలన ఆట ప్రారంభించడం ఆలస్యమైతే సమయాన్ని బట్టి ఓవర్లను కుదిస్తారు.
  • మొత్తం 20 ఓవర్లలో.. 15 ఓవర్లు (లేదా) 10 ఓవర్లు, (లేదా) చివరకు 5 ఓవర్ల పాటు అయినా మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు.
  • అది కూడా కుదరకపోతే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.
  • ఒకవేళ వర్షం వలన సూపర్ ఓవర్ వేసే అవకాశం కూడా లేకపోతే.. లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టును చివరకు విజేతగా ప్రకటిస్తారు.
  • అయితే ఈ సీజన్ లీగ్ దశలో గుజరాత్ టైటాన్స్ అత్యధిక పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
  • దీంతో ఐపీఎల్-2023 టైటిల్ మరోసారి గుజరాత్ టైటాన్స్ వశమవుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here