తెలంగాణ సాగునీటి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు, మల్లన్నసాగర్‌ ప్రారంభోత్సవంపై మంత్రి కేటీఆర్

Minister KTR Termed MallannaSagar Inauguration as Momentous Day in Telangana’s Irrigation History, Minister KTR Termed MallannaSagar Inauguration, Minister KTR Says A Momentous Day in Telangana’s Irrigation History, Momentous Day in Telangana’s Irrigation History, Telangana’s Irrigation History, Minister KTR, KT Rama Rao, Minister KT Rama Rao, Minister of Municipal Administration and Urban Development of Telangana, Telangana Minister KTR, Telangana Minister KTR Termed MallannaSagar Inauguration, Telangana Minister KTR Says A Momentous Day in Telangana’s Irrigation History, MallannaSagar Inauguration, MallannaSagar Inauguration Latest News, MallannaSagar Inauguration Latest Updates, MallannaSagar Inauguration Live Updates, Mango News, Mango News Telugu, Telangana Irrigation,

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు (ఫిబ్రవరి 23, బుధవారం) మల్లన్నసాగర్‌ రిజర్వాయర్ ను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌-4లో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో రూ.6,805 కోట్ల వ్యయంతో మల్లన్నసాగర్‌ రిజర్వాయర్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. ఈ నేపథ్యంలో మల్లన్నసాగర్‌ రిజర్వాయర్ ప్రారంభోత్సవంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్‌ ను సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో ఇది తెలంగాణ సాగునీటి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు అని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ మల్లన్నసాగర్‌ విశేషాలతో కూడిన ఒక వీడియోను కూడా జత చేశారు.

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన ఈ 50 టీఎంసీల రిజర్వాయర్ 11.29 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుందని తెలిపారు. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద మరియు భారతదేశానికి గొప్ప గర్వకారణమైన ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సహకరించిందని మీరు అనుకుంటున్నారు? అని నెటిజన్లను మంత్రి కేటీఆర్ ప్ర‌శ్నించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =