తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు, రాబోయే 5 ఏళ్లలో 4 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యం: మంత్రి కేటీఆర్

Minister KTR Unveiled Telangana Mobility Valley at the Mobility Next Hyderabad Summit 2023,Mobility Next Hyderabad Summit 2023,Mobility Next Hyderabad 2023,Mobility Next Hyderabad,Mango News,Mango News Telugu,Mobility Summit 2023,Mobility Summit 2022,Smart Mobility Conference 2022,Mobility Conferences 2022,International Mobility Conference 2022,Global Mobility Conference 2022,Future Of Mobility Summit 2022,Mobility Conclave 2022,Mobility Ecosystem 2030,Global Mobility Summit

హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్‌లో భాగంగా నిర్వహిస్తున్న మొబిలిటీ నెక్స్ట్ హైదరాబాద్ సమ్మిట్ మొదటి ఎడిషన్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే ‘తెలంగాణ మొబిలిటీ వ్యాలీ (టీఎంవీ)’ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. దేశంలోనే తొలి మొబిలిటీ-ఫోకస్డ్ క్లస్టర్ గా తెలంగాణ మొబిలిటీ వ్యాలీ నిలవనుంది. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఉత్తమమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని, భారతదేశంలో తయారీ మరియు ఆర్ అండ్ డీ లో తెలంగాణను అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

“టీఎంవీ సుమారు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి, రాబోయే 5 సంవత్సరాలలో 4 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల 4 మెగా క్లస్టర్‌లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. జహీరాబాద్‌లో ఈవీ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, సీతారాంపూర్‌లో ఈవీ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, దివిటిపల్లిలో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (ఈఎస్ఎస్) క్లస్టర్ మరియు ఎంకతల వద్ద ఇన్నోవేషన్ క్లస్టర్ అభివృద్ధి చేస్తున్నాం, ప్రతి క్లస్టర్‌ అత్యాధునిక మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది” అని మంత్రి కేటీఆర్ తెలిపారు.

3,000 కోట్లకుపైగా పెట్టుబడులను ప్రకటించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, వాటి వివరాలను రాబోయే 2 వారాల్లో అందజేస్తామని తెలిపారు. ఈ పెట్టుబడులు తెలంగాణలో ఎలక్ట్రిక్ 3-వీలర్, ఎలక్ట్రిక్ 2-వీలర్ మరియు ఛార్జింగ్ పరికరాల తయారీ ఏకో సిస్టమ్ ను మరింత బలోపేతం చేస్తాయన్నారు. ఎలక్ట్రిక్ 2 వీలర్స్/3 వీలర్స్/4 వీలర్స్, అడ్వాన్స్‌డ్ సెల్ కెమిస్ట్రీ మరియు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్, టైర్ 1 మరియు టైర్ 2 కాంపోనెంట్ తయారీదారులు మరియు ఆటో ఇంజినీరింగ్ ఆర్ అండ్ డీ రంగాల్లో ఆయా కంపెనీల కార్యకలాపాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీ పనిచేస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ రంగంలోని నిపుణులు మరియు గ్లోబల్ ఆటోమోటివ్ ఎకోసిస్టమ్ భాగస్వాములను ఒకచోట చేర్చడం కోసం హైదరాబాద్ ఇ-మొబిలిటీ వీక్ క్రమం తప్పకుండా నిర్వహించబడుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సమ్మిట్‌ లో ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సాఫ్ట్‌వేర్ బిజినెస్ అండ్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ హెడ్ – గ్లోబల్, అమెరికాస్ మరియు ఆసియా స్టెల్లాంటిస్, మమతా చామర్తి, వోల్వో గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ ఎండీ కమల్ బాలి, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =