ట‌ర్కీ, సిరియాలో భూకంప విల‌యం.. 4,500 మందికి పైగా మృతి – ట్విట్టర్ వేదికగా స్పందించిన మంత్రి కేటీఆర్

Minister KTR Deeply Saddened in Twitter Over Thousands of People Lost Lives by Devastating Earthquake in Turkey and Cyria,Turkey Earthquake 2023,Antakya Turkey Earthquake,Biggest Turkey Earthquake,Istanbul Turkey Earthquake Today,Mango News,Mango News Telugu,Kusadasi Turkey Earthquake,Last Turkey Earthquake,Turkey Biggest Earthquake,Turkey Earthquake,Turkey Earthquake 2022,Turkey Earthquake 2023 News,Turkey Earthquake Latest News,Turkey Earthquake News,Turkey Earthquake Prediction,Turkey Earthquake Reason,Turkey Earthquake Risk Map,Turkey Earthquake Time Today,Turkey Earthquake Today,Turkey Istanbul Earthquake Today,Turkey Latest Earthquake

టర్కీ, సిరియా దేశాలలో సంభవించిన భూకంపం వల్ల ఇప్పటికే దాదాపు 4,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. అంతకు రెట్టింపు సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉత్పాతంలో వందలాది భవనాలు, ఇళ్ళు పూర్తిగా నేలమట్టమయ్యాయి. అయితే వరుస ప్రకంపనల మధ్య సహాయక చర్యలు అనుకున్నంతగా ముందుకు సాగడం లేదు. శిథిలాల తొలగింపు కోసం వేల మంది సైన్యాన్ని దింపాయి ఈ దేశాలు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. తొలి ప్రకంపన తర్వాత మళ్ళీ మరో రెండు, మూడు తీవ్ర స్థాయి ప్రకంపనలు సహా మొత్తం 40 వరకు ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు.

ఈ నేపథ్యంలో టర్కీ, సిరియాలలో సంభవించిన భూకంపం విషాదంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా ఆయన ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో.. ‘టర్కీ మరియు సిరియా దేశాలలో సంభవించిన భూకంప విధ్వంసం దృశ్యాలు చూసి షాక్ అయ్యాను. ఇది నిజంగా మానవాళికి చాలా బాధాకరమైన రోజు. ఈ కష్ట కాలంలో ఆ రెండు దేశాల ప్రజలకు భ‌గ‌వంతుడు శక్తి ప్రసాదించాలి. అలాగే ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు నా ప్ర‌గాఢ సానుభూతి’ అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =