మార్కెట్ లోకి టీఎస్‌ఆర్టీసీ ‘జీవ’ వాటర్‌ బాటిల్స్, ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్

Minister Puvvada Lanches TSRTC Own Brand Ziva Drinking Water Bottles Available in Market from Today,Minister Puvvada Lanches Ziva Drinking Water Bottles,Ziva Drinking Water Bottles,TSRTC Ziva Drinking Water Bottles,Mango News Telugu,Mango News,Minister Puvvada Ajay,CM KCR News And Live Updates,Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు సేవలు అందించడంతో పాటుగా కార్గో సహా ఇతర సేవలను విజయవంతంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా డ్రింకింగ్‌ వాటర్‌ బిజినెస్ లోకి ప్రవేశించి, ‘జీవ’ అనే పేరుతో సొంత బ్రాండ్‌ ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ బాటిళ్లను టీఎస్‌ఆర్టీసీ మార్కెట్ లోకి తీసుకువచ్చింది. సోమవారం ఉదయం హైదరాబాద్ లోని ఎంజీబీఎస్‌ బస్టాండ్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఎస్‌ఆర్టీసీ ‘జీవ’ వాటర్‌ బాటిళ్లను తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ లతో కలిసి ప్రారంభించారు. రవాణా, ఆర్ అండ్ బీ కార్యదర్శి శ్రీనివాస రాజు సహా పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జీవ వాటర్ బాటిల్స్ కు స్ప్రింగ్‌ ఆఫ్‌ లైఫ్‌ అనే ట్యాగ్‌లైన్‌ పెట్టారు. అత్యంత నాణ్యత ప్రమాణాలతో జీవ వాటర్ బాటిళ్లు ప్రవేశపెడుతున్నామని, నేటి నుంచి మార్కెట్ లో అందుబాటులో ఉంటాయని వీసీ సజ్జనార్ తెలిపారు. జీవ వాటర్ బాటిల్స్ ను బస్టాండ్‌, బుకింగ్‌ కౌంటర్స్, బయటి మార్కెట్లలో విక్రయాలు జరపనుండగా, దశలవారీగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. ముందుగా ఒక లీటర్‌ వాటర్‌ బాటిల్స్ అందుబాటులో ఉంటాయని, అనంతరం కార్యాలయాల కోసం 250 ఎంఎల్‌ బాటిల్స్ ఉత్పత్తి చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక ఏసీ బస్సుల ప్రయాణికుల కోసం అర లీటర్‌ బాటిల్స్ కూడా తీసుకురానున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 3 =