గవర్నర్ తమిళిసై లేఖపై స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అన్ని సందేహాలు నివృత్తి చేస్తామని వెల్లడి

Minister Sabitha Indra Reddy Responds Over Governor Tamilisai Soundararajan's Letter, Minister Sabitha Indra Reddy,Governor Tamilisai Soundararajan's Letter,Telangana Governor Tamilisai Soundararajan ,Telangana Governor,Tamilisai Soundararajan ,Mango News,Mango News Telugu,Soundararajan,Tamilisai, Tamilisai Soundararajan Latest News And Updates,Telangana Governor, Telangana Governor News And Live Updates,Telangana Governor,Telangana News And Updates, Governer Helped accident Victim

తెలంగాణ‌ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ రాసిన లేఖ ప్రభుత్వానికి అందిందని, అందులో ఆమె వ్యక్తం చేసిన అన్ని సందేహాలను నివృత్తి చేస్తామని తెలిపారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి. ఈ మేరకు ఆమె బుధవారం దీనిపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. రాష్ట్రంలోని యూనివ‌ర్సిటీల ఉమ్మ‌డి నియామ‌క బోర్డుపై గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై కొన్ని సందేహాల‌ను లేవనెత్తారని, త్వరలోనే వాటికి సమాధానం ఇస్తామని స్ప‌ష్టం చేశారు. వ‌ర్సిటీల ఉమ్మ‌డి నియామ‌క బోర్డుపై న్యాయ‌ప‌ర‌మైన అన్ని అంశాల‌ను గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రిస్తామ‌ని, ఇందులో ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తుందని పేర్కొన్నారు.

అలాగే గ‌వ‌ర్న‌ర్‌ తమిళిసైని కలవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపిన మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి.. గ‌వ‌ర్న‌ర్‌ అపాయింట్‌మెంట్ కోరామని, ఇంకా రాలేదని, వచ్చిన వెంటనే గ‌వ‌ర్న‌ర్‌ను కలుస్తామని అన్నారు. ఇక నిజాం క‌ళాశాల హాస్ట‌ల్ వివాదంపై స్పందిస్తూ.. ఓయూ వీసీ ప్రొఫెస‌ర్ రవీంద‌ర్ యాద‌వ్ మరియు నిజాం కాలేజీ ప్రిన్సిప‌ల్‌తో మాట్లాడుతున్నానని, నిజాం కాలేజీలో చ‌దువుతున్న అమ్మాయిల‌ను పిలిచి మాట్లాడి న్యాయం చేస్తానని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి హామీ చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here