సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యం కోసం.. ‘మృత్యుంజయ హోమం’ నిర్వహించిన మంత్రి సత్యవతి రాథోడ్

Minister Satyavathi Rathod Performs Mrityunjaya Homam For The Sake of CM KCR, Mrityunjaya Homam For The Sake of CM KCR, Minister Satyavathi Rathod, Satyavathi Rathod, Satyavathi Rathod Mrityunjaya Homam, Mrityunjaya Homam, Minister of Scheduled Tribal Women and Child Welfare of Telangana, CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, KCR Chief minister of Telangana, KCR Health, KCR Health Condition, KCR Health News, KCR Health Reports, KCR Latest Health Condition, KCR Latest Health Report, KCR Latest News, KCR Latest Updates, KCR News, Mango News, Mango News Telugu,

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంపూర్ణ ఆరోగ్యం కోసమని, ‘మృత్యుంజయ హోమం’ తలపెట్టారు, రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్. ఈరోజు (సోమవారం) తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రుల నివాస ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చారణతో ‘మృత్యుంజయ హోమం’ దిగ్విజయంగా జరిపించారు. సీఎం కేసీఆర్ అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోవాలని, ఆయన ఎల్లప్పుడూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఈ హోమం నిర్వహించినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.

సీఎం కేసీఆర్ గతవారం అనారోగ్యంతో యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ సత్వరమే కోలుకోవాల‌ని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ ఈ మృత్యుంజయ హోమం జరిపారు. ఈ ఉదయం 5 గంటలకు మృత్యుంజయ హోమం ప్రారంభమయింది. హోమంలో భాగంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాలోతు కవిత, మంత్రులు ఎర్రబెల్లి, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, సురభి వాణీ దేవి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి సహా పలువురు టీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 6 =