తెలంగాణలో జనవరి 27 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్ర‌క్రియ‌ ప్రారంభం

Telangana Teachers Promotions and Transfers Process will start From January 27th,Telangana Teachers Promotions,Teachers Transfers Process,Transfers Process will start From January 27th,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister KTR

తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయుల బదిలీలకు, ప్రమోషన్లకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవలే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 27వ తేదీ నుంచి ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్ర‌క్రియ ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లపై శుక్రవారం విద్యాశాఖ కార్య‌ద‌ర్శి వాకటి క‌రుణ‌, పాఠ‌శాల విద్యా శాఖ సంచాలకులు దేవ‌సేన, ఇత‌ర అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి స‌మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జనవరి 27 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని మంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా, ఎలాంటి అపోహలకు తావు లేకుండా జరగాలన్నారు. ఇందుకు సంబంధించి వెంటనే సమగ్ర షెడ్యూల్ విడుదల చేయాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు.

జనవరి 15, ఆదివారం నాడు ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల అంశంపై మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, “విద్యాశాఖలో పనిచేస్తున్న టీచర్స్ అందరికి సీఎం కేసీఆర్ శుభవార్త తెలియజేశారు. విద్యా శాఖ తరపున సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్స్, ట్రాన్ఫర్స్ కు సంబంధించి ఒక షెడ్యూల్ విడుదల చేయమని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఆదివారం కొంత కసరత్తు చేయడం జరిగింది. గతంలో ఏ విధంగా అయితే చేశామో, వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే ఈ ప్రక్రియ చేపట్టనున్నాం. మొదటగా హెడ్ మాస్టర్స్ కు ట్రాన్ఫర్స్ ఇచ్చిన తరువాత, అంచలవారీగా ప్రమోషన్స్ ఉంటాయి. 9,266 పోస్టులకు సంబంధించిన ప్రమోషన్స్, వీలైనంత త్వరగా షెడ్యూల్ విడుదల చేయమని సీఎం కేసీఆర్ చెప్పారు, త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తాం. అయితే ఇప్పుడు ప్రమోషన్స్, ట్రాన్ఫర్స్ ఇచ్చినప్పటికీ పిల్లలకు సంబంధించి విద్యకు ఇబ్బంది కలగకుండా, పదో తరగతి పరీక్షలు అయిపోయాక ఏప్రిల్ 23 నుంచి అమల్లోకి వచ్చేలా ఆదేశాలు ఇవ్వనున్నాం. వీటి తర్వాత మోడల్ స్కూల్స్ కు సంబంధించి కూడా ప్రమోషన్స్ చేపట్టనున్నాం” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =