మెదక్ రైల్వేస్టేషన్ లో రైల్వే రేక్ పాయింట్ ప్రారంభించిన మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి

Telangana Ministers Harish Rao Niranjan Reddy Inaugurates Railway Rake Point at Medak Railway Station, Ministers Harish Rao Niranjan Reddy Inaugurates Railway Rake Point at Medak Railway Station, Minister Niranjan Reddy Inaugurates Railway Rake Point at Medak Railway Station, Minister Harish Rao Inaugurates Railway Rake Point at Medak Railway Station, Railway Rake Point at Medak Railway Station, Medak Railway Station Railway Rake Point, Railway Rake Point, Medak Railway Station, Minister Niranjan Reddy, Minister Harish Rao, Telangana Finance Minister Harish Rao, Telangana Minister Harish Rao, Finance Minister Harish Rao, Medak Railway Station Railway Rake Point News, Medak Railway Station Railway Rake Point Latest News, Medak Railway Station Railway Rake Point Latest Updates, Medak Railway Station Railway Rake Point Live Updates, Mango News, Mango News Telugu,

మెదక్ రైల్వే స్టేషన్ లో రైల్వే రేక్ పాయింట్ ను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఫరూక్ హుస్సేన్, సుభాష్ రెడ్డి, యాదవ రెడ్డి, కలెక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, దశాబ్దాల కల ఈరోజు నిజం అయ్యిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యం అయ్యిందని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు ఖర్చు చేస్తే ఈ రైలు వచ్చింది. త్వరగా రైలు రావాలని వాటా కట్టి ఏర్పాటు చేశామని చెప్పారు. ఏటా 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సనత్ నగర్ గోడౌన్ కి పంపుతున్నాము. ఇప్పుడు ఇక్కడే స్టాక్ చేసి దేశంలో వివిధ రాష్ట్రాలకు పంపుతామని పేర్కొన్నారు.

మెదక్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని, మెదక్ జిల్లా ప్రజల చిరకాల కల సాధ్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. సింగూర్ జలాలు మెదక్ కు దక్కాలని నినాదం ఉండేదని, అది నిజం చేశామన్నారు. “కొందరు ఉప ఎన్నిక అంటున్నారు. ఎందుకు ఏమైనా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారా?, మేము తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేశాం. తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టాలని త్యాగాలు చేశాం. ఢిల్లీ దాకా తెలంగాణ వాదాన్ని వినిపించేందుకు త్యాగాలు చేశాం. మరి ఉపఎన్నిక కోసం మాట్లాడుతున్న వారిని అడుగుతున్నా, మీరు తెస్తామంటున్న ఉపఎన్నిక వల్ల తెలంగాణకు ఏ లాభం?, ప్రజలకు ఏం లాభం?, రాష్ట్రానికి ఏదైనా ప్రత్యేక ప్యాకేజీ తెస్తారా!?, పాలమూరుకు జాతీయ ప్రాజెక్టు ఇప్పిస్తరా?” అని ప్రశ్నించారు. “ఉపాధి హామీ కూలీలు రోజుకు రెండు సార్లు అటెండెన్స్ ఇవ్వాలా, అస్సలు పథకం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. గ్యాస్ సబ్సిడీ కోత, ఉపాధి హామీలో కోత, ప్రభుత్వ సంస్థల కోత, ఉద్యోగాల్లో కోత, ఉచితాలు వద్దని ప్రధాని మోదీనే చెబుతున్నారు. అంటే రైతు బంధు వద్ద, కరెంట్ వద్దా, కళ్యాణ లక్ష్మి వద్దా?, పేదలు, రైతుల గురించి ఏనాడైనా ఆలోచన చేశారా?” అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 7 =