ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ వేడుకలు ఘనంగా నిర్వహించాలి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

Telangana Governor Tamilisai Soundararajan Calls for Grand Celebration of Azadi ka Amrit Mahotsav, Telangana Governor Calls for Grand Celebration of Azadi ka Amrit Mahotsav, Governor Tamilisai Soundararajan Calls for Grand Celebration of Azadi ka Amrit Mahotsav, Tamilisai Soundararajan Calls for Grand Celebration of Azadi ka Amrit Mahotsav, Grand Celebration of Azadi ka Amrit Mahotsav, Azadi ka Amrit Mahotsav Grand Celebration, Azadi ka Amrit Mahotsav, Telangana Governor made a fervent appeal for the grand celebrations of the Azadi ka Amrit Mahotsav, 75 years of Independence, Telangana Governor Tamilisai Soundararajan, Governor Tamilisai Soundararajan, Tamilisai Soundararajan, Telangana Governor, Azadi ka Amrit Mahotsav Celebrations News, Azadi ka Amrit Mahotsav Celebrations Latest News, Azadi ka Amrit Mahotsav Celebrations Latest Updates, Azadi ka Amrit Mahotsav Celebrations Live Updates, Mango News, Mango News Telugu,

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ విజ్ఞప్తి చేశారు. మన దేశభక్తికి చిహ్నంగా హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుండి 15 వరకు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలని గవర్నర్ ప్రజలను కోరారు. సోమవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్ భవన్ స్కూల్‌ విద్యార్థులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. అలాగే విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి ఐదు నోట్‌బుక్‌లను అందజేజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, “మనం 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను ఎంతో గర్వంగా, గౌరవంగా మరియు సంతోషంగా జరుపుకోవాలి. మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం, మనం దానిని గర్వించాలి” అని అన్నారు. అదేవిధంగా త్రివర్ణ పతాకాన్ని తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ప్రొఫైల్ పిక్‌గా పోస్ట్ చేయాలని గవర్నర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (IRCS) తెలంగాణ రాష్ట్రంలో 75 వైద్య శిబిరాలు మరియు సమాన సంఖ్యలో రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు ఆన్‌లైన్ పోటీలు కూడా నిర్వహించి 75 మంది విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నట్టు చెప్పారు. అంతకుముందు గవర్నర్ రాజ్ భవన్ పాఠశాలలోని తరగతి గదులను సందర్శించి, విద్యార్థులను పలకరిస్తూ వారితో సంభాషించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీకి స్పాన్సర్ చేసిన భారత్ సేవా ఆశ్రమ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =