కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే మణిహారంగా నిల్వనుంది: మంత్రి తలసాని శ్రీనివాస్

Ministers Talasani Sriniva Mahmood Ali Visited Command Control Centre Today, Minister Mahmood Ali Visited Command Control Centre Today, Minister Talasani Sriniva Visited Command Control Centre Today, Ministers Talasani Sriniva And Mahmood Ali, Command Control Centre, police command control Centre, Police Command and Control Centre at Banjara Hills, Banjara Hills Police Command and Control Centre, Police Command and Control Centre, iconic Integrated Command and Control Centre at Banjara Hills, New Police Command and Control Centre at Banjara Hills, Hyderabad Police Commissionerate, Banjara Hills, Police Command and Control Centre News, Police Command and Control Centre Latest News, Police Command and Control Centre Latest Updates, Police Command and Control Centre Live Updates, Mango News, Mango News Telugu,

కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే మణిహారంగా నిల్వనున్నదని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్, మహమూద్ అలీలు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త, డీజీపీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, జీహెఛ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ లతో కలిసి సందర్శించారు.

అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ, అత్యాధునిక టెక్నాలజీతో సుమారు 600కోట్ల రూపాయల వ్యయంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మించడం జరిగిందని చెప్పారు. ఆగస్టు 4వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఇది ప్రారంభం కానుందని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ కమాండ్ కంట్రోల్ భవనాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల్లో ఉన్న టెక్నాలజీ ని ఉపయోగించడం జరుగుతుందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానం చేస్తూ కమాండ్ కంట్రోల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నా కమాండ్ కంట్రోల్ నుండి పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. డీజీపీ, హైద్రాబాద్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయాల నుండి కూడా శాంతిభద్రతలను పర్యవేక్షించడం జరుగుతుందని వివరించారు. ఇక్కడి నుండి తక్షణం సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయబడతాయని చెప్పారు. రానున్న రోజులలో కమాండ్ కంట్రోల్ మన దేశానికే కాకుండా ఇతర దేశాలకు కూడా ఆదర్శనీయం కానున్నదని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =