రాష్ట్రంలో వర్షాలపై‌ సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్ష జరిపి, కుటుంబ పెద్దలా అండగా నిలిచారు: ఎమ్మెల్సీ క‌విత

Kavitha Kalvakuntla Appeals to People not to Come out Unless it is an Emergency due to Heavy Rains, MLC Kavitha Appeals to People not to Come out Unless it is an Emergency due to Heavy Rains, TRS MLC Kavitha Appeals to People not to Come out Unless it is an Emergency due to Heavy Rains, People not to Come out Unless it is an Emergency due to Heavy Rains, Heavy Rains In Telangana, Heavy Rains, MLC Kavitha Appeals to People not to Come out, TRS MLC Kavitha Kalvakuntla, MLC Kavitha Kalvakuntla, Kavitha Kalvakuntla, TRS MLC, Heavy rains continue to lash TS, Incessant Rains in the Telangana State, Heavy Rains In Telangana News, Heavy Rains In Telangana Latest News, Heavy Rains In Telangana Latest Updates, Heavy Rains In Telangana Live Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా, అప్రమత్తంగా ఉండాలని టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ట్వీట్ చేశారు. “రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలపై‌ సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తూ, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు అందిస్తూ కుటుంబ పెద్దలా అండగా నిలుస్తున్నారు” అని అన్నారు.

“ప్రసవానికి వారం గడువున్న గర్భిణులకు కూడా ముందుగానే ఆస్పత్రులకు తరలించి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ, వరద ప్రాంతాల్లో వైద్య, విద్యుత్, త్రాగునీటి వసతులకు ఎలాంటి అవాంతరాలు రాకుండా సీఎం కేసీఆర్ పెద్దన్నలా వ్యవహరిస్తున్నారు. ఒక వైపు ప్రభుత్వం, మరోవైపు టీఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం ఎక్కడికక్కడ వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఆహార పంపిణీ చేస్తూ ప్రజలకు ధైర్యాన్నిస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి” అని ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + four =