ఎన్నికలలో వేలికి పెట్టే సిరాను ఎక్కడ, ఎలా తయారు చేస్తారు?

Where and How Is Finger Ink Made in Elections,Where and How Is Finger Ink Made,Finger Ink Made in Elections,Election Ink,Indelible Ink Used in Elections,the Science of Indelible Ink,Mango News,Mango News Telugu,Where Is Finger Ink, Finger Ink in Elections, Elections, Finger Ink, Mysore Paints and Varnish,Finger Ink in Elections Latest News,Finger Ink in Elections Latest Updates,Finger Ink Latest News,Elections Latest News
Where is finger ink, finger ink in elections?, elections, finger ink, Mysore Paints and Varnish

ఎన్నికలు వస్తున్నాయంటేనే అందరికీ  ముందుగా గుర్తుకొచ్చేది వేలికి పెట్టే సిరా చుక్కనే. వేటు వేశాక చేతి వేలిపై వేసే ముద్రను సెలబ్రెటీలు సైతం అందరికీ చూపిస్తూ గర్వంగా తాము ఓటేసామని మీరు కూడా వేయండి చెబుతూ  ఉంటారు. అయితే ఈ సిరా చుక్క వెనుక పెద్ద హిస్టరీనే ఉందట.

జరుగుతున్న ఎన్నికలలో ఎవరైనా సరే తన ఓటుహక్కు వినియోగించుకున్నాక మరోసారి బోగస్, రీసైక్లింగ్ ఓటును అరికట్టడానికి ఎన్నికల సంఘం దీనిని ప్రవేశపెట్టింది.ఈ సిరా గుర్తు వేలిపై పడ్డాక దానిని చెరిపేద్దామన్నా 72 గంటల వరకూ చెరిగిపోదు. ఇక అది వేలికి పూర్తిగా తొలిగొపోవడానికి  దగ్గర దగ్గర 20 రోజుల నుంచి నెల రోజలు వరకూ సమయం పడుతుంది.

కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌లోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీ ఈ సిరాను  తయారు చేస్తుంది.  1962లో కేంద్ర ప్రభుత్వం సిరా ఉత్పత్తి కోసం మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీకి అనుమతిచ్చింది. నేషనల్ ఫిజికల్ ల్యాబరేటరీస్ ‌ ఫార్ములాను ఫాలో అయ్యేలా సిరా ఉత్పత్తి బాధ్యతను  మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్  కంపెనీకి అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సరే..  అక్కడ నుంచే  సిరాను సరఫరా చేస్తున్నారు. ఎన్నికలలో వాడే ఈ  సిరాలో 7.25 శాతం సిల్వర్ ‌ నైట్రేట్‌ ఉండటం వల్ల .. వేసిన వెంటనే చెరిగిపోదు.అప్పట్లో ఎన్నికల సమయాన  గోరు పై భాగపు చర్మంపైనే సిరా వేసేవారు . కానీ  2006 ఫిబ్రవరి ఒకటి నుంచి ఓటు వేస్తేన్నవ్యక్తి ఎడమ చేతి చూపుడు వేలు గోరు పైభాగం నుంచి కిందివరకు కూడా ఈ  సిరా గుర్తు వేస్తున్నారు.

భారతదేశంలో తయారవుతున్న మన సిరాకు అంతర్జాతీయంగా కూడా చాలా డిమాండ్  ఉంది.భారత దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా  అన్ని రాష్ట్రాల ఎన్నికలకు ఈ సిరాను సరఫరా చేయడంతో పాటు.. 1976 నుంచి ఇప్పటి వరకూ కూడా మొత్తం 29 దేశాలకు ఇక్కడి నుంచే సిరా ఎగుమతి అవుతోంది. పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, అఫ్ఘనిస్తాన్, నేపాల్, లెబనాన్, అల్జీరియా, మయన్మార్, ఇరాక్,ఇండోనేషియా,   సూడాన్‌, సిరియా, టర్కీ, ఈజిప్టు ఇలా 29  దేశాల్లో ఎన్నికల సమయంలో మన సిరానే వినియోగిస్తున్నారు.

మరోవైపు హైదరాబాద్‌లో కూడా ఎన్నికల సిరాను తయారు చేస్తున్నారు. హైదరాబాద్ రాయుడు ల్యాబొరేటరీస్‌లో తయారయ్యే ఈ  సిరాను వందకు పైగా ఆఫ్రికన్‌ దేశాలకు సరఫరా చేస్తున్నారు. అలాగే తెలంగాణలో జరిగే పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో హైదరాబాద్‌లో తయారయ్యే సిరానే  వినియోగిస్తున్నారు. అంతేకాదు పోలియో చుక్కలు వేసే సమయంలో చిన్న పిల్లలకు గుర్తుగా పెట్టడానికి.. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో  హైదరాబాద్  సిరానే వాడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =