రాష్ట్రంలో వర్షాలు, పునరావాస చర్యలపై సీఎస్‌ సమీక్ష, 19071 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు

CS Somesh Kumar held Meeting over Situation Arising out of the Incessant Rains in the State, Telangana CS Somesh Kumar held Meeting over Situation Arising out of the Incessant Rains in the State, Somesh Kumar held Meeting over Situation Arising out of the Incessant Rains in the State, Telangana CS held Meeting over Situation Arising out of the Incessant Rains in the State, Meeting over Situation Arising out of the Incessant Rains in the State, Situation Arising out of the Incessant Rains in the State, Incessant Rains in the Telangana State, Incessant Rains in the State, Incessant Rains, Telangana Chief Secretary Somesh Kumar, Telangana CS Somesh Kumar, Chief Secretary Somesh Kumar, Somesh Kumar, Incessant Rains in Telangana News, Incessant Rains in Telangana Latest News, Incessant Rains in Telangana Latest Updates, Incessant Rains in Telangana Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలు, ఇప్పటి వరకు చేపడుతున్న సహాయ పునరావాస కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణా శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ అధికారులు పాల్గొన్నారు. గత కొద్దీ రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల ఏర్పడ్డ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, ఏవిధమైన భారీ నష్టం జరగలేదని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 19,071 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు:

గోదావరీ నదీ పరివాహక ప్రాంతాలలో ఉన్నజిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రధానంగా గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్న ములుగు, భూపాలపల్లి, భద్రాచలం జిల్లాలపై మరింత అప్రమత్తంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని కాపాడామని, దీనికి తోడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 16 మందిని, వైమానిక దళం ద్వారా ఇద్దరినీ రక్షించినట్టు
సీఎస్ తెలిపారు. అలాగే రాష్ట్రంలో 223 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి 19,071 మందికి షెల్టర్ కల్పించామని తెలిపారు. భద్రాచలం జిల్లాలో 43 శిబిరాలలో 6318 మందికి ఆశ్రయం కల్పించగా, ములుగు జిల్లాలో 33 క్యాంప్ లలో 4049 మందికి, భూపాలపల్లి జిల్లాలో 20 క్యాంప్ లలో 1226 మందికి ఆశ్రయం కల్పించామని సీఎస్ సోమేశ్ కుమార్ వివరించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =