నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ అరెస్ట్.. మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు తీవ్రం

ED Arrests Ex-NSE CEO Chitra Ramakrishna in Money Laundering Case Related To Illegal Phone Tapping, Ex-NSE CEO Chitra Ramakrishna in Money Laundering Case Related To Illegal Phone Tapping, ED Arrests Ex-NSE CEO Chitra Ramakrishna in Money Laundering Case, Money Laundering Case Related To Illegal Phone Tapping, Illegal Phone Tapping, ED Arrests Ex-NSE CEO Chitra Ramakrishna, Money Laundering Case, Ex-NSE CEO Chitra Ramakrishna, Former NSE CEO Chitra Ramakrishna, NSE CEO Chitra Ramakrishna, Chitra Ramakrishna, Former NSE CEO, National Stock Exchange, Ex-NSE CEO Chitra Ramakrishna Arrest News, Ex-NSE CEO Chitra Ramakrishna Arrest Latest News, Ex-NSE CEO Chitra Ramakrishna Arrest Latest Updates, Ex-NSE CEO Chitra Ramakrishna Arrest Live Updates, Mango News, Mango News Telugu,

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) మాజీ సీఈవో చిత్రా రామకృష్ణకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. ఈ మేరకు ఒక మనీలాండరింగ్ కేసులో అక్రమ ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి గురువారం ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం చిత్రాను ప్రత్యేక సీబీఐ కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆమెను నాలుగు రోజుల ఈడీ కస్టడీకి ఆదేశించింది. కాగా చిత్రాతో పాటు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే, ఎన్ఎస్ఈ మాజీ అధిపతి రవి నారాయణ్‌లపై కూడా ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసును నమోదు చేసింది. అలాగే దీనిలో మరో సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్ కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రహస్య నిఘాలో జరిగిన అవకతవకలను ఈడీ గుర్తించిందని, ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయవలసిందిగా సిబిఐని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఎ)కి నివేదించిందని అధికారులు తెలిపారు.

సంజయ్ పాండేకు సంబంధించిన సంస్థకు ఇచ్చిన కాంట్రాక్టు మరియు కొందరిపై అక్రమంగా నిఘా పెట్టడంపై ఈడీతో పాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కూడా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పాండే మద్దతుగల ఐ సెక్ సర్వీసెస్ ప్రై లిమిటెడ్ కు చెల్లించిన సొమ్ముకు సంబంధించిన రశీదులు, రికార్డింగ్స్ వాయిస్ శాంపిల్స్, రికార్డింగ్స్ ఒరిజినల్ ట్రాన్‌స్క్రిప్ట్స్, సర్వర్లు, రెండు ల్యాప్‌టాప్‌లను సీబీఐ స్వాధీనం చేసుకుంది. అలాగే నాలుగు ఎంటీఎన్ఎల్ లైన్స్ ద్వారా పలువురి ఫోన్స్ ట్యాపింగ్ చేసినట్లు కూడా సాక్ష్యాధారాలు లభించాయని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఎన్‌ఎస్‌ఈ ఉద్యోగుల ఫోన్ కాల్‌లను అక్రమంగా అడ్డగించడం ద్వారా వారిపై నిఘా పెట్టేందుకు ముంబై రిటైర్డ్ కమిషనర్ పాండే స్థాపించిన సంస్థలో రామకృష్ణ, నరైన్‌లు చేరారని సిబిఐ స్పష్టం చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =