జంతర్‌మంతర్‌లో మొదలైన ఎమ్మెల్సీ కవిత నిరసన దీక్ష.. ప్రారంభించిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

MLC Kavitha Starts Nirasana Deeksha at Jantar Mantar in Delhi CPM General Secretary Sitaram Yechury Attends,MLC Kavitha Starts Nirasana Deeksha,Jantar Mantar in Delhi,CPM General Secretary Sitaram Yechury Attends,Mango News,Mango News Telugu,MLC Kavitha Meets Sitaram Yechury,MLC Kavitha Deeksha in Delhi today,Yechury To Inaugurate Kavitha's Delhi Protest,MLC Kavitha Deeksha today,Under Fire Over Liquor Policy Scam,Jantar Mantar Diksha Arrangements,Kalavakuntla Kavitha News,MLC Kavitha Latest News and Updates,Jantar Mantar Diksha Latest Updates

దేశవ్యాప్తంగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ అమలు చేయాలనే డిమాండ్‌తో భారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వేదికగా నిరసన దీక్ష చేపట్టారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా దీక్ష కొనసాగనుండగా.. ఎమ్మెల్సీ కవితతో పాటు సుమారు 500 మంది ఈ దీక్షలో కూర్చోనున్నారు. దేశంలోని 29 రాష్ట్రాల నుండి మహిళల హక్కుల కోసం పోరాడుతున్న వివిధ మహిళా సంఘాలు, పలు పార్టీల నేతలు దీక్షకు హాజరుకానున్నారు. కాగా కవిత నిరసన దీక్షకు దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 18 పార్టీల ప్రతినిధులు సంఘీభావం ప్రకటించారు. ఇక సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ ఉదయం ఎమ్మెల్సీ కవితచే దీక్షను ప్రారంభింపజేశారు. ఇక తెలంగాణకు చెందిన మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి మరియు సీతా దయాకర్ రెడ్డి కవితతో పాటు దీక్షలో కూర్చున్నారు.

ఈ క్రమంలో నేటి సాయంత్రం 4 గంటలకు దీక్ష సీపీఐ కార్యదర్శి డీ రాజా, కవితచే దీక్షను విరమింపజేయనున్నారు. అయితే అంతకుముందు జంతర్ మంతర్ వద్ద దీక్ష ఏర్పాట్లలో నిమగ్నమైన ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. కవిత దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో దీక్షను మరోచోటికి మార్చాలని కవితకు పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా అనుమతి ఇచ్చామని, ఇప్పుడు ఎలా మారుస్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు చర్చల అనంతరం కొన్ని ఆంక్షలతో ఎమ్మెల్సీ కవిత జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి ఢిల్లీ పోలీసులు అనుమతించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + five =