మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ అధ్యక్ష్య ఎన్నికల బరిలో నలుగురు?

4 Celebrities Likely To Compete for President Post, Hema In The MAA Election Battle, Jeevitha, MAA Elections, MAA Elections 2021, Manchu Vishnu to Contest for MAA President, Mango News, Movie Artists Association, Movie Artists Association election results, Movie Artists Association Elections, Prakash Raj to contest for MAA Association Election 2021, Prakash Raj to contest for MAA Elections, Tollywood’s MAA elections

గత కొన్నేళ్ల నుంచి తెలుగు సినీపరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికలు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ‘మా’ అధ్యక్ష ఎన్నికలు మరింత ఉత్కంఠగా కలిగించే దిశగా వెళ్తున్నాయి. మా అధ్యక్ష పదవికోసం ఈసారి మరింతమంది ప్రముఖ నటులు బరిలోకి దిగనుండడంతో రోజురోజుకి రసవత్తరంగా మారుతుంది. విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ఈసారి మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఇప్పటికే ప్రకటించారు. అగ్రనటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడు, హీరో మంచు విష్ణు కూడా బరిలో దిగనున్నారు. వీరిద్దరి మధ్యే పోటీ నెలకుంటుందా అనుకునే సమయంలో నటి జీవిత రాజశేఖర్ సైతం మా ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.

మరోవైపు ప్రముఖ నటి హేమ కూడా మా ఎన్నిక‌ల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాల‌నుకుంటునట్టు తాజాగా ప్రకటించారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం, అభివృద్ధి, ‘మా’ సొంత భవన నిర్మాణం సహా పలు అంశాలపై ఎవరికీ వారే ప్రణాళికలు సిద్ధం చేసుకుని బరిలోకి దిగబోతున్నట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో చివరికి ఎంతమంది బరిలో ఉండనున్నారు?, ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సహా ఇతర అగ్రనటుల మద్ధతు ఎవరికీ ఉండబోతుంది, ఎవరు మా అధ్యక్షుడిగా ఎన్నికవనున్నారో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =