మునుగోడులో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగనున్న ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్‌

Munugode Bye-election: Popular Poet Singer Gaddar to Contest from KA Paul's Prajasanthi Party, Singer Gaddar Contest from Munugode, KA Paul's Prajasanthi Party, Singer Gaddar to Contest from Prajasanthi Party, Mango News, Mango News Telugu, Munugode By-Election Latest News And Updates, Munugode By-Election, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, TRS Party, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు నవంబర్‌ 3న పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నిక‌ల సంఘం(ఈసీ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికలో కేఏ పాల్‌ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీ కూడా బరిలోకి దిగుతుంది. ప్రజాశాంతి పార్టీ తరుపున మునుగోడు ఉపఎన్నికలో ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్‌ పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని బుధవారం హైదరాబాద్‌ లోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పార్టీ అధినేత కేఏ పాల్‌ ప్రకటించారు.

ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ, ఇటీవల చూసిన అనేక పరిణామాల అనంతరం గ్లోబల్ పీస్ కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. కేఏ పాల్, వారి కమిటీ తనకు గ్లోబల్ పీస్ అంబాసిడర్ గా ఇచ్చారని చెప్పారు. అందులో భాగంగా భారత రాజ్యాంగాన్ని తీసుకుని మునుగోడులోని పల్లెపల్లెకు వెళ్లి ప్రజలకు శాంతిని భోదించనున్నానని, అలాగే పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీలో భాగంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఆ పార్టీలోకి, ఈ పార్టీలోకి అనే ప్రచారానికి పుల్ స్టాప్ పెడుతూ, తొలిసారిగా పార్లమెంటరీ డెమోక్రసీ పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీ లోకి వెళుతున్నానని చెప్పారు. ప్రజాశాంతి పార్టీలో కలిసి తొలిదశగా మునుగోడు ప్రజలను కలుస్తానని అన్నారు. ప్రజాశాంతి పార్టీని నిర్మాణం చేయడం, ఎన్నికలను ఎదుర్కోవడం చేస్తానని చెప్పారు. తన 75 సంవత్సరాల జీవితంలో తొలిసారిగా ప్రజాశాంతి పార్టీతో కలిసి కొనసాగాలని నిర్ణయించుకున్నానని, ప్రజల అశీర్వాదం కోసం గురువారం నుంచే ప్రచారం ప్రారంభిస్తానని గద్దర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 4 =