కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ 4వ రోజు: నేడు కేరళలోకి ప్రవేశించనున్న రాహుల్ గాంధీ పాదయాత్ర

Congress Bharat Jodo Yatra Rahul Gandhi Padayatra To Enter Kerala From TN Mulagumoodu Today, Rahul Gandhi Padayatra Enter To Kerala From TN , Rahul Gandhi Congress Bharat Jodo Yatra , Rahul Gandhi launches Bharat Jodo Yatra, Bharat Jodo Yatra, Congress Bharat Jodo Yatra , Rahul Gandhi Launches Congress Bharat Jodo Yatra, Rahul Gandhi Bharat Jodo Yatra, Mango News, Mango News Telugu, Tamil Nadu Rajasthan and Chhattisgarh CM Attended, Rahul Gandhi Congress Bharat Jodo Yatra, Rahul Gandhi , Rajiv Gandhi, Priyanka Gandhi, Sonia Gandhi, Rahul Gandhi Latest News And Updates

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ‘భారత్ జోడో యాత్ర’ నాలుగవరోజు కొనసాగుతోంది. ఈ క్రమంలో పాదయాత్ర శనివారం రాత్రికి కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి రాహుల్ గాంధీ 12 కిలోమీటర్ల మేర నడిచి లంచ్ విరామానికి కొద్దిసేపు ఆగారు. కన్యాకుమారి జిల్లా మార్తాండం లోని నేసమని క్రిస్టియన్ మెమోరియల్ కళాశాలలో మధ్యాహ్న భోజనం చేశారు. కాగా రోజుకు దాదాపు 25 కిలోమీటర్ల మేర ఆయన నడక కొనసాగిస్తున్నారు. సాయంత్రం తిరిగి కొనసాగనున్న రాహుల్ పాదయాత్ర ఈరోజు రాత్రికి త్రివేండ్రం దగ్గరలోని చెరువర కోణం వద్ద కేరళలోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో కేరళలో ఆయనకు పెద్ద యెత్తున స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.

కేపీసీసీ ప్రెసిడెంట్‌ సుధాకరన్‌ సహా పార్టీ ముఖ్య నేతలంతా రాహుల్‌తో కలిసి యాత్రలో పాల్గొననున్నారు. తిరువనంతపురం నుంచి త్రిసూర్ వరకూ 7 జిల్లాల మీదుగా ఈ పాదయాత్ర సాగనుంది. ఇక కేరళలో 19 రోజుల పాటు రాహుల్ పాదయాత్ర కొనసాగనుండగా, ఈ క్రమంలో సుమారు 457 కిలోమీటర్ల మేరకు ఆయన నడవనున్నారు. కాగా రాహుల్‌ గాంధీ యాత్రకు దారిపొడవునా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా యువత ఆయనతో కలిసి సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చేపట్టిన ఈ పాదయాత్ర ద్వారా వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి రావాలని ఆ పార్టీ ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + ten =