హైదరాబాద్‌లో శుక్రవారం ప్రార్థనల తర్వాత ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించవద్దు – ఎంఐఎం అధినేత అసదుద్దిన్‌ ఒవైసీ

AIMIM Chief Asaduddin Owaisi Appeals People For Peace During Friday Prayers in Hyderabad, Prophet remark row, AIMIM Chief appeals for peace during Friday prayers, peace during Friday prayers, AIMIM president Asaduddin Owaisi has appealed to the people of Hyderabad to maintain peace today, Friday Prayers in Hyderabad, AIMIM president Asaduddin Owaisi, Asaduddin Owaisi, Prophet row, Prophet Remark, sar tan se juda, Prophet Muhammad, Mango News, Mango News Telugu,

హైదరాబాద్‌లో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా శాంతిభద్రతలు కాపాడాలని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒక వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్‌ను అరెస్టు చేయాలన్న ప్రధాన డిమాండ్ నెరవేరినందున, శుక్రవారం ప్రార్థనల తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని అసదుద్దీన్‌ ఒవైసీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు. దీనిలో.. ముస్లింలు, ముఖ్యంగా యువత తమ ఇళ్ల సమీపంలోని మసీదుల్లో ప్రార్థనలు చేసి శాంతియుతంగా తిరిగి ఇళ్లకు వెళ్లాలని ఈ సందర్భంగా ఒవైసీ కోరారు. వర్గాలను గాయపరిచే ఎలాంటి నినాదాలు చేయకూడదని, ఏదైనా అవాంఛనీయ సంఘటన పేదలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యలకు నిరసనగా కొందరు ముస్లిం నాయకులు నేడు నగరంలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని ప్రకటించిన నేపథ్యంలో.. అసదుద్దీన్‌ ఒవైసీ ఈ విధంగా స్పందించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 1 =