ఇప్ప‌టి వ‌ర‌కు ఓ లెక్క‌.. ఇక‌పై మ‌రో లెక్క‌..

One Calculation So Far Now Another Calculation,Brs Plans Big Political Game,Game On In Telangana Politics,Telangana Political Game,Mango News,Mango News Telugu,Pawan Kalyan,Janasena Chief Pawan Kalyan,Cm Kcr News And Live Updates, Telangna Congress Party, Telangna Bjp Party, Ysrtp,Trs Party, Brs Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Genaral Assembly Elections

తెలంగాణలో ఎన్నిక‌ల‌కు పోలింగ్ స‌మ‌యం స‌మీపిస్తున్న కొద్దీ కొన్నిచోట్ల సీన్ మారుతోంది. పొలిటిక‌ల్ గేమ్ చేంజ్ అవుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఓ అభ్య‌ర్థి.. ఇప్పుడు మ‌రో అభ్య‌ర్థి గెలుపున‌కు ద‌గ్గ‌ర దారిలో ఉన్న‌ట్లుగా ప‌రిస్థితులు మారుతున్నాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్ లోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గ‌మైన ఖైర‌తాబాద్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు గ‌ట్టి పోటీ ఇచ్చి గెలిచే అవ‌కాశాలు ఉన్నాయంటూ విప‌క్ష పార్టీ అభ్య‌ర్థి పై ఊహాగానాలు ఉండేవి. రెండు మూడు రోజుల కింద‌టి వ‌ర‌కూ ఆ అభ్య‌ర్థే గెలుస్తారు అనేలా ప‌రిస్థితి ఉండేది. ప్ర‌స్తుతం గేం చేంజ్ అయింది. ప్ర‌జెంట్ పిఫ్టీ ఫిఫ్టీ అన్న‌ట్లుగా సీన్ మారింది.

మ‌రో నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీ బీఆర్ ఎస్ కు చెందిన అభ్య‌ర్థి త‌న‌కున్న పేరుకు, తాను చేసిన అభివృద్ధికి గెలుపు తిరుగులేదు అన్న‌ట్లుగా ధీమాగా ఉండేవారు. ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధిస్తానని ఆ ప్రజాప్రతినిధి భావించారు. కానీ.. ఇప్పుడు ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చిన‌ట్లు ఆయ‌న చేయించిన స‌ర్వే ద్వారా తెలిసింది. దీంతో ఆయ‌న కూడా ప్ర‌చార ప‌ర్వంలో దూకుడు పెంచారు. ఉదయం, సాయంత్రం విస్తృత ప్రచారం చేస్తూ ఓట‌ర్ల‌ను క‌లుస్తున్నారు. ద‌య‌చేసి.. మీ ఓటు నాకే వేయండి.. అని అంద‌రినీ కోరుతున్నారు. సిటింగ్‌ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ సారి విజయం నాదే అని ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఒకరు కొన్నాళ్లుగా చెప్పుకుంటూ వస్తున్నారు.

ముందుగానే టికెట్‌ దక్కుతుందన్న సంకేతాలుండడంతో ప్రాంతాల వారీగా స్థానిక శాసనసభ్యుడు పరిష్కరించని సమస్యలను గుర్తించాడు. 2018 ఎన్నికల్లో హామీల్లో నెరవేర్చనివి ఎన్ని అన్న లెక్కలు తీశాడు. ఇవి చాలు తాను ఈజీగా గెలుస్తానని పలుమార్లు ప్రతిపక్ష పార్టీ నాయకుడు అనుచరులతో పేర్కొన్నాడు. కానీ ఇప్పుడా అభ్యర్థి ఎక్కే గడప.. దిగే గడప అన్నట్టు తీరిక లేకుండా పర్యటిస్తున్నారు. ఇలా తెలంగాణ‌లో చాలా చోట్ల నియోజ‌క‌వ‌ర్గాల్లో పొలిటిక‌ల్ ప‌వ‌ర్ అటు.. ఇటు.. మారుతోంది. మొన్నటి వరకు గెలుపు నల్లేరు మీద నడకే అన్న వారికి కూడా ఒణుకు పుట్టేలా రాజ‌కీయాలు మారుతున్నాయి.

మాకు ఎదురే లేదనుకున్న అధికార పార్టీ.. ఈ సారి మా ప్రభుత్వమే అని మొన్నటి వరకు చెప్పుకున్న ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ప్రచారంలో చెమటోడుస్తున్నారు. , సాయంత్రం ఇంటింటి ప్రచారం చేస్తూనే.. కాలనీ, కమ్యూనిటీ, కుల, యువజన, మహిళా సంఘాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాగినోళ్లకు తాగినంత.. తిన్నోళ్లకు తిన్నంత అన్నట్టుగా సంతృప్తిపరస్తూ.. ఓటు వేయండి.. అడిగివన్నీ చేస్తామని అభ్యర్థిస్తున్నారు. శివారు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. శివారు ప్రాంతంలోని ఓ నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు.. స్థానిక రియల్టర్లకు వేర్వేరుగా పార్టీలు ఏర్పాటు చేశారు. బస్తీ సంఘాల నాయకులతోనూ ప్రత్యేకంగా సమావేశమై గంపగుత్తగా ఓట్ల వేట కొనసాగించారు.

దీంతో గెలిచేందుకు స్ట్రాట‌జీ మారుస్తున్నారు. అంద‌రినీ డ‌బ్బుతో ద‌గ్గ‌ర‌కు చేర్చుకుంటున్నారు. కుద‌ర‌క‌పోతే అధికారంలో ఉన్న కొంద‌రు బెదిరింపుల‌తో దారికి తెచ్చుకునే ప‌నిలో ఉన్నారు. గంప‌గుత్త‌గా ఓట్లు పొందేందుకు సామ‌పాన దండోపాయాల‌ను ఉప‌యోగిస్తున్నారు. త‌న‌కు అసంతృప్తి లేకుండా చేసుకుని.. అంద‌రినీ ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి నానా తంటాలు ప‌డుతున్నారు. ఎత్తుల‌కు.. పై ఎత్తులు వేసేందుకు బ‌ల‌మైన వ్యూహ‌క‌ర్త‌ల‌ను అన్వేషిస్తున్నారు. ఎంత ఖ‌ర్చ‌యినా ప‌ర్వాలేదు.. వ్యూహాల్లో త‌ల‌పండిన నేత‌ల కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =