స్వతంత్ర అభ్యర్థుల గుర్తులతో నేతల్లో గుబులు

Among The Leaders With Symbols Of Independent Candidates,Telangana Party Symbols,Telangana Party Symbols Independent Candidates,Telangana Independent Candidates,Independent Candidates Symbols,Mango News,Mango News Telugu,Pawan Kalyan,Janasena Chief Pawan Kalyan,Cm Kcr News And Live Updates, Telangna Congress Party, Telangna Bjp Party, Ysrtp,Trs Party, Brs Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Genaral Assembly Elections

తెలంగాణ శాసనసభ ఎన్నికలో ప్రధాన పార్టీలకు.. స్వతంత్ర అభ్యర్థుల గుర్తులు టెన్షన్ పెడుతోన్నాయి. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి గుర్తుల కేటాయింపు పూర్తవగా.. వీటిలో కొన్ని ప్రధాన పార్టీలను పోలిన గుర్తులు ఉన్నాయి. ఈవీఎంలో దగ్గర దగ్గర పోలికలు ఉండే గుర్తులుంటే పోలింగ్ సమయంలో ఓటర్లు తికమక పడుతుంటారు.

ముఖ్యంగా వృద్ధులు, నిరక్షరాస్యులు తాము వేయాలనుకున్న పార్టీకి కాకుండా వేరొకరికి ఓటు వేసే ప్రమాదం ఉంది. దీనిపై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కోర్టును,ఈసీని కూడా ఆశ్రయించింది. ఆ మధ్య   5 రాష్ట్రాలలో జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడానికి 193 గుర్తులతో కూడిన.. ఫ్రీ సింబల్స్ లిస్టును ఈసీ ప్రకటించింది. అయితే వీటిలో ఆటో , హ్యాట్, ఇస్త్రీ పెట్టె, ట్రక్కు గుర్తులను ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఎవరికీ కేటాయించకుండా ఉత్తర్వులు జారీ చేసింది

ఆటో , హ్యాట్, ఇస్త్రీ పెట్టె, ట్రక్కు నాలుగు గుర్తులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.ఎందుకంటే పైన  చెప్పిన గుర్తులు..తెలంగాణ అధికారల బీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారుకు దగ్గరగా ఉండటం పైగా బీఆర్ఎస్ అభ్యర్థనను కూడా పరిగణనలోకి తీసుకుని  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ గుర్తుల విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది బీఆర్ఎస్ పార్టీ. ఆటో రిక్షా, హ్యాట్, ఇస్త్రీపెట్టె, ట్రక్కు గుర్తులు కంటి చూపు సరిగా లేని వారికి కారు వలే కనిపిస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ గుర్తుల వల్ల కొంతమంది  అవగాహన  మరియు కంటిచూపు  లేనివాళ్లు కన్ఫ్యూజ్ అవుతున్నారని.. దీని వల్ల పార్టీకి పడాల్సిన ఓట్లు ఆయా గుర్తులకు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.  గత ఎన్నికల్ల సమయంలోనే ఈ విషయంలో  తాము నష్టపోతున్నామని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ లెటర్  ద్వారా ఫిర్యాదు చేసింది.

బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన అభ్యర్థన పత్రాన్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం..ఈ సారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణలో ఆ నాలుగు గుర్తులను ఎవరికీ కేటాయించకూడదని నిర్ణయం తీసుకుంది. అయితే బీఆర్ఎస్ నాయకులు..  రోడ్ రోలర్, రోటీ మేకర్ ను మాత్రం ఎవరికీ ఇవ్వొద్దని కోరినా కూడా దానిని ఫ్రీ సింబల్స్ జాబితాలో అలాగే ఉంచడం బీఆర్ఎస్ నాయకులను కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. అప్పుడు ఆ నేతలు భయపడినట్లే ఇప్పుడు జరుగుతోంది.

ప్రస్తుత ఎన్నికల్లో శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో.. యుగ తులసి పార్టీ పేరుతో  అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరికి రోడ్డు రోలర్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థితో పాటు  షాద్‌నగర్, చేవెళ్ల నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు రోడ్డు రోలర్ గుర్తునే కేటాయించారు. అలాగే  ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో అలయన్స్ ఆఫ్ డెమెక్రాటిక్ రిఫారమ్స్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న క్యాండిడేట్లకు చపాతీ కర్ర, రోడ్డు రోలర్ గుర్తును ఇచ్చారు

ఇక జనసేన గుర్తు అయిన గాజు గ్లాసు.. తెలంగాణలో ఫ్రీ సింబల్ లిస్టులో ఉండటం జనసేన పార్టీని కలవర పరుస్తోంది. శేరిలింగంపల్లి, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న రాజమహేంద్ర కటారి, సుబ్రమణ్య రాహుల్‌కు  గాజు గ్లాస్ గుర్తునే ఎన్నికల సంఘం కేటాయించింది. కల్వకుర్తిలో ఎ స్యూసీఐ పార్టీ నుంచి పోటీ చేస్తున్న  అభ్యర్థికి కూడా  గాజు గ్లాసును కేటాయించి జనసేన పార్టీని ఈసీ కలవరపెడుతోంది.

నిజానికి ఏ పార్టీ అయినా జనాల్లోకి చొచ్చుకపోయేది , ఆ పార్టీ నేతలను జనాల్లోకి తీసుకువెళ్లేది వారి పార్టీకి కేటాయించిన గుర్తే. అందులోనూ ఎన్నికల సమయంలో దీని పాత్ర మరింత ఎక్కువగా ఉంటుంది.  అయితే ఈ సారి ఎన్నికల్లో కూడా ప్రధాన పార్టీలకు.. స్వతంత్ర అభ్యర్థుల గుర్తులు తలనొప్పిగా మారిపోవడంతో గుర్తుల గుబులు పట్టుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =