యువ కార్యకర్తల విజ్ఞప్తి, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధం – పవన్ కళ్యాణ్

GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Schedule, GHMC Elections Updates, Jana Sena to contest in GHMC elections, Janasena Party, Janasena Party will Contest in GHMC Elections, Mango News Telugu, pawan kalyan, Pawan Kalyan Janasena Party, Pawan Kalyan On GHMC Elections

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

“గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేయాలని యువ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు నిర్ణయించాం. తెలంగాణ రాష్ట్రంలోనూ, జీహెచ్‌ఎంసీ పరిధిలోను పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు, యువ జనసైనికులు నుంచి ఈ అంశంపై పలు విజ్ఞప్తులు వచ్చాయి. వారి వినతి మేరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులను, నగర పరిధిలోని కమిటీలకు స్పష్టం చేశాను. నా వద్దకు వచ్చిన కార్యకర్తలు, కమిటీల ప్రతినిధులు ఇప్పటికే పలు దఫాలు సమావేశమై చర్చించుకున్నారు. జీహెచ్‌ఎంసీలోని పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్ర స్థాయిలో పని చేస్తూ, ఇప్పటికే ప్రజల పక్షాన నిలబడ్డాయి. తమ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని క్షేత్ర స్థాయిలోని కార్యకర్తలు బలంగా కోరుకొంటున్నారు. వారి అభీష్టానికి అనుగుణంగా జనసేన పార్టీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలుపుతుంది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =