యువతకు యుద్ధ కళలు, సాహస క్రీడల్లో నైపుణ్యాలు అవసరం : పవన్ కళ్యాణ్

Janasena, Janasena Party, Mango News, Martial Arts and Adventure Sports Necessary for New Generation, Navatarani Needs Martial Arts, pawan kalyan, Pawan Kalyan 1 Lakh Gifted To Martial Arts Master Prabhakar, Pawan Kalyan About Martial Arts and Adventure Sports, Pawan Kalyan felicitates martial arts trainer, Pawan Kalyan Says Skills in Martial Arts, Pawan Kalyan Skills in Martial Arts

యువతకు దేహ దారుడ్యంతోపాటు మానసిక బలం చేకూరేందుకు యుద్ధ కళలు, సాహస క్రీడల్లో నైపుణ్యాలు దోహదం చేస్తాయి. వీటిని నేర్చుకోవడం ఎంతైనా అవసరమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. మన దేశంలోనూ పలు సంప్రదాయ యుద్ధ కళలు ఉన్నాయి. వాటితోపాటు పలు ఆసియా దేశాల మార్షల్ ఆర్ట్ కూడా ప్రాచుర్యంలో ఉన్నాయన్నారు. చిన్నప్పటి నుంచీ బాలబాలికలకు నేర్పిస్తే ఆత్మ రక్షణ విద్యగాను, మనోస్టెర్యం ఇచ్చే మార్గంగాను ఇవి ఉపయోగపడతాయని అన్నారు. నెల్లూరుకు చెందిన మార్షల్ ఆర్ట్ శిక్షకులు, పలు గిన్నిస్ బుక్ రికార్డులు పొందిన ప్రభాకర్ రెడ్డిని శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సత్కరించారు. పవన్ కళ్యాణ్ నెలకొల్పిన ట్రస్ట్ ‘పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ ద్వారా రూ.లక్ష చెక్ అందచేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “వింగ్ చున్ అనే మార్షల్ ఆర్ట్ మన దేశంలో ఉన్న శిక్షకుల గురించి బ్రౌజ్ చేస్తుంటే ప్రభాకర్ రెడ్డి గురించి తెలిసింది. మార్షల్ ఆర్ట్స్ లో వివిధ దేశాల్లో శిక్షణ పొంది, రికార్డులు సాధించిన ఆయన పెద్ద పెద్ద నగరాలకు వెళ్లిపోకుండా తన ఊళ్ళో ఉంటూ యువతకు శిక్షణ ఇవ్వడం సంతోషం. ఇలాంటివారిని ప్రోత్సహించాలి. ఈ క్రమంలోనే మా ట్రస్ట్ ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించాను” అన్నారు.

ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ “మార్షల్ ఆర్ట్ లో 29 ప్రపంచ రికార్డులు సాధించాను. చైనా, థాయిలాండ్, మలేసియా, శ్రీలంకల్లో పలు యుద్ధ కళలు నేర్చుకున్నాను. చైనాలోని షావోలిన్ టెంపుల్ లో శిక్షణ పొందాను. యువతకు మార్షల్ ఆర్ట్ లో ప్రవేశం ఉండటం ఎంతో ఉపయోగపడుతుంది. మన దేశంలో వీటిని నేర్చుకొంటున్న వారు తక్కువగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు పలు మార్షల్ ఆర్ట్ లో ప్రవేశం ఉంది. వీటిపై ఆసక్తి కూడా చాలా ఎక్కువ. వారు నన్ను పిలిచి సత్కరించి, ఆర్థిక సహాయం ఇవ్వడం చాలా ఆనందాన్నిచ్చింది. పవన్ కళ్యాణ్ కు నా కృతజ్ఞతలు” అని అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ‘వింగ్ చున్’ గురించి తెలుసుకున్నారు. వింగ్ చున్ వుడెన్ డమ్మీపై కొన్ని మెళకువలు తెలుసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 4 =