రైతుబంధు : తొలిరోజు 19.98 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.586.65 కోట్లు జమ

Rythu Bandhu Rs 586.65 Cr Deposited in Accounts of 19.98 Lakh Farmers on First Day, Telangana Rythu Bandhu Rs 586.65 Cr Deposited in Accounts of 19.98 Lakh Farmers on First Day, Rs 586.65 Cr Deposited in Accounts of 19.98 Lakh Farmers on First Day, Rs 586.65 Cr Deposited in Accounts of 19.98 Lakh Farmers, 19.98 Lakh Farmers, Telangana Rythu Bandhu, Rythu Bandhu, Telangana agriculture minister Singireddy Niranjan Reddy, agriculture minister Singireddy Niranjan Reddy, minister Singireddy Niranjan Reddy, Telangana agriculture minister, Singireddy Niranjan Reddy, agriculture minister, Telangana Rythu Bandhu News, Telangana Rythu Bandhu Latest News, Telangana Rythu Bandhu Latest Updates, Telangana Rythu Bandhu Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు వానాకాలం సీజన్ కు సంబంధించి రైతుబంధు పంట పెట్టుబడి సాయం పంపిణీ జూన్ 28, మంగళవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిరోజైన మంగళవారం జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలియజేశారు. తొలిరోజున 19.98 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.586.65 కోట్ల రైతుబంధు నిధులు జమ చేసినట్టు మంత్రి వెల్లడించారు. తొలిరోజున ఎకరం లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమచేసినట్టు తెలిపారు.

దేశంలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, రాష్ట్రవ్యాప్తంగా రైతు సోదరుల సంబరాలు చేసుకుంటున్నారని, సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని పేర్కొన్నారు. సాగు కోసం రైతాంగం ఎవరివద్దా చేయిచాచకూడదన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు. రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర రైతాంగం పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మరోవైపు బుధవారం నాడు రెండు ఎకరాల్లోపు భూములున్న 16.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,234.09 కోట్ల రైతుబంధు నిధులు జమ కానున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =