జూలై 4న భీమవరంలో అల్లూరి విగ్రహవిష్కరణ చేయనున్న ప్రధాని మోదీ, మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం

Union Minister Kishan Reddy Invites Megastar Chiranjeevi to Attend PM Modi Bhimavaram Event, Minister Kishan Reddy Invites Megastar Chiranjeevi to Attend PM Modi Bhimavaram Event, Kishan Reddy Invites Megastar Chiranjeevi to Attend PM Modi Bhimavaram Event, Megastar Chiranjeevi Receives Special Invitation To Attend PM Modi Bhimavaram Event, Chiranjeevi Receives Special Invitation To Attend PM Modi Bhimavaram Event, Megastar Receives Special Invitation To Attend PM Modi Bhimavaram Event, PM Modi Bhimavaram Event, Megastar Chiranjeevi, Hero Chiranjeevi, Actor Chiranjeevi, Bhimavaram Event, PM Modi Bhimavaram Event News, PM Modi Bhimavaram Event Latest News, PM Modi Bhimavaram Event Latest Updates, PM Modi Bhimavaram Event Live Updates, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 4వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. దేశంలో జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా విప్లవ వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని జూలై 4న భీమవరంలో 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో భీమవరంలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానాన్ని పంపించారు.

“ఈ సంవత్సరం జూలై 4, 2022న దేశం శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని జరుపుకోనుంది. అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలలో “మన్యం వీరుడు” గా గౌరవించబడతారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా, వలస శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు మద్రాసు ప్రెసిడెన్సీలోని గిరిజన సంఘాలను ఏకం చేయడంలో మరియు శిక్షణ ఇవ్వడంలో అల్లూరి సీతారామరాజు చేసిన కృషిని గుర్తించే అవకాశం మనకు ఉంది. దీనికి సంబంధించి జూలై 4న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం రానున్నారు. ఈ షెడ్యూల్‌లో పెదమిరంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగం మరియు భీమవరం ఏఎస్ఆర్ నగర్ లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. ప్ర‌ధాని కార్య‌క్ర‌మంలో భాగంగా జూలై 4న భీమ‌వ‌రంలో జరిగే కార్యక్రమానికి మీరు హాజరుకావాలని కోరుతున్నాను. అల్లూరి సీతారామరాజు గౌరవార్థం వచ్చే ఒక సంవత్సరంలో అంటే జూలై 4, 2023 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వంతో పాటు భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. వివిధ కార్యక్రమాలను గ్రాండ్‌గా విజయవంతం చేయడంలో మీ మద్దతు మరియు సహకారాన్ని కోరుతున్నాను” అని నటుడు చిరంజీవికి పంపిన ఆహ్వానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + fourteen =