42.34 లక్షల రైతుల ఖాతాల్లో 2955.70 కోట్ల రైతుబంధు నగదు జమ

Rythubandhu Distribution: So far 2955.70 Cr Deposited in Accounts of 42.34 Lakh Farmers,Rythu Bandhu,Rythu Bandhu Money,Rythu Bandhu Money Distribution,Rythu Bandhu Money Distribution Starts,Rythu Bandhu Money Distribution 2955.70 Cr Deposited,Mango News,Mango News Telugu,Rythu Bandhu 2020,Telangana,Telangana News,Rythu Bandhu News,Telangana Rythu Bandhu Latest Update,Rythu Bandhu Money Distribution Date,Telangana Rythu Bandhu Status,Rythu Bandhu Scheme,Telangana Govt,CM KCR,Telangana CM KCR,Rythu Bandhu Latest News,Telangana Rythu Bandhu,KCR Govt,Rythu Bandhu Distribution,Telangana Farmers

తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీ డిసెంబర్ 28, సోమవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్ధన రెడ్డి తెలియజేశారు. “యాసంగి-2020 సీజన్ కు గాను తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం పెట్టుబడి సహాయము క్రింద 60,88,402 మంది రైతులకు 149.50 లక్షల ఎకరాలకు గాను 7474.78 కోట్ల రూపాయలను మంజూరు చేయడమైంది. డిసెంబర్ 28, 2020 నుండి జనవరి 8, 2021 వరకు విడతల వారీగా రైతుబంధు పెట్టుబడి సహాయము ఎకరాకు 5000/- రూపాయల చొప్పున రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుంది. బుధవారం వారం వరకు 42,33,974 మంది రైతులకు 59.11 లక్షల ఎకరాలకు గాను 2955.70 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగింది. డిసెంబర్ 31, గురువారం నాడు 640571 మంది రైతులకు 22.48 లక్షల ఎకరాలకు గాను 1123.78 కోట్ల రూపాయలును నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది” అని వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్ధన రెడ్డి తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 2 =