తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ

IAS Officers Transferred In Telangana, Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana IAS Officers, Telangana IAS Officers Transferred, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019
తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్‌ కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ బదిలీ అయ్యారు. ఆయన్ను ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా నియమించారు. జోగులంబ-గద్వాల్ జిల్లా కలెక్టర్ కె.శశంకాను బదిలీ చేస్తూ, సర్ఫరాజ్‌ అహ్మద్‌ స్థానంలో కరీంనగర్ కలెక్టర్‌గా నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జోగులంబ-గద్వాల్ కలెక్టర్‌గా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మొహంతికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డైరెక్టర్ జనరల్ బుసాని వెంకటేశ్వర రావును బదిలీ చేసి విపత్తు నిర్వహణ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. మరోవైపు పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డాక్టర్ ఎ.అశోక్ ని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డీజీగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే జోషి డిసెంబర్ 15, ఆదివారం నాడు ఉత్తర్వులు జారీచేశారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here