కాంగ్రెస్‌లో విలీనమైన ‘తెలంగాణ ఇంటి పార్టీ’.. ఖర్గే సమక్షంలో పార్టీలో చేరిన అధ్యక్షుడు చెరుకు సుధాకర్

Telangana Inti Party President Cheruku Sudhakar Joins and Merged His Party in Congress Today, Inti Party President Cheruku Sudhakar Joins and Merged His Party in Congress Today, Cheruku Sudhakar Joins and Merged His Party in Congress Today, Inti Party President Joins and Merged His Party in Congress Today, Sudhakar has merged his party with the Congress, Telangana Politics, Inti Party President Cheruku Sudhakar Joins in Congress Today, Inti Party President Cheruku Sudhakar Merged His Party in Congress Today, Telangana Inti Party President Cheruku Sudhakar, Inti Party President Cheruku Sudhakar, Inti Party President, Cheruku Sudhakar, Congress Party, Telangana Inti Party News, Telangana Inti Party Latest News, Telangana Inti Party Latest Updates, Telangana Inti Party Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఆయన త్వరలో బీజేపీలో చేరనున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలహీనపడుతోందన్న సంకేతాలను దూరం చేయడానికి పలువురు నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు, ‘తెలంగాణ ఇంటి పార్టీ’ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను పార్టీలోకి చేర్చుకుంది. ఆయన తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తూ పార్టీ అగ్రనేత ‘మల్లికార్జున ఖర్గే’ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చెరుకు సుధాకర్‌ రాకను ఆహ్వానిస్తున్నామని, ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడుకు త్వరలో ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేసే విషయంపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. చలమల కృష్ణారెడ్డి, చెరుకు సుధాకర్‌లలో ఒకరిని ప్రకటించే యోచనలో ఉంది. ఈరోజు జరిగే మునుగోడు కార్యకర్తల సమావేశంలో అభ్యర్థిని అధికారంగా ప్రకటించే అవకాశముంది.ఈ క్రమంలోనే చెరుకు సుధాకర్‌ను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారం నల్గొండ జిల్లా చండూరులో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో చెరుకు సుధాకర్ కూడా పాల్గొనేనున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారంపై చర్చ జరుగుతుండగా.. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో రేవంత్ రెడ్డి ఎక్కడా తగ్గడం లేదు. దీంతో రాష్ట్రంలో.. ముఖ్యంగా టీ కాంగ్రెస్‌లో రాజకీయం ఆసక్తి కలిగిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here