తెలంగాణ ఎన్నికలు ఒక ఎత్తు..కామారెడ్డి రాజకీయం మరో ఎత్తు

Katipalli defeated KCR and Revanth together,Katipalli defeated KCR,KCR and Revanth together,Katipalli Venkataramana Reddy, BJP,KCR,Congress, Brs , Congress,Telangana angry with KCR,Telangana Assembly Elections 2023,assembly seat, Telangana Election,Mango News,Mango News Telugu,Katipalli Latest News,Katipalli Latest Updates,Telangana Assembly polls,Congress Telangana Win,Revanth Reddy Wins,Assembly Election Results 2023,Telangana Latest News and Updates
Katipalli Venkataramana Reddy, BJP,KCR,Congress, Brs , Congress,Telangana angry with KCR,Telangana Assembly Elections 2023,assembly seat, Telangana Election,

ఓడలు బండ్లు అవడం, బండ్లు ఓడలవడం రాజకీయాల్లో చాలా మామూలుగా కనిపించే విషయాలు. హేమాహేమీలుగా రాజ్యాన్ని ఏలినవాళ్లు.. బొక్క బోర్లా పడటాలు వెరీ కామన్‌గా కనిపిస్తుంటాయి. జనాల్లో అంతగా పరిచయం లేని వ్యక్తి  రాజకీయ ఉద్దండులను డీకొట్టడమే ఎక్కువనుకుంటే.. వారిపై విజయం సాధించి మరీ సత్తాను చాటుకోవడం కూడా అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఇలాంటి గెలుపు సంఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశం అయింది.

తెలంగాణ  శాసనసభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో ఆల్ టైం రికార్డ్ గెలుపు ఎవరిది అంటే  కామారెడ్డి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డిదే అంటున్నారు అంతా. అందుకే హేమీహేమీలు అయిన  ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన రేవంత్ రెడ్డిని ఆయన ఓడించి సంచలన విజయాన్ని సాధించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీంతో తెలంగాణ ఎన్నికలు ఒక ఎత్తు అయితే, కామారెడ్డి రాజకీయం మరో ఎత్తు అన్నట్టుగా ఉందన్న టాక్ నడుస్తోంది.

అవును 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తర్వాత కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేరు ఇప్పుడు  రాజకీయ వర్గాల్లో తెగ మార్మోగుతోంది. మొన్నటి వరకూ  కేవలం కామారెడ్డి జిల్లా నేతగానే ఉన్న వెంకటరమణారెడ్డి.. నిన్నటి నుంచీ  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేతగా మారిపోయారు. బీజేపీ అభ్యర్థి అయిన వెంకటరమణా రెడ్డి .. కేసీఆర్‌పై 6,741 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 66,652 ఓట్లతో కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించగా.. కేసీఆర్‌ 59,911 ఓట్లు, రేవంత్‌రెడ్డి 54,916 ఓట్లను మాత్రమే రాబట్టుకోగలిగారు. చివరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలోనూ 1257 ఓట్లు బీజేపీకే పడ్డాయి.

నిజానికి అన్ని నియోజకవర్గాల కంటే కూడా కేసీఆర్‌, రేవంత్‌  రెడ్డి పోటీ చేస్తుండంతో మొదటి నుంచి కామారెడ్డి పైనే  అందరి దృష్టి ఉంది. వీరిద్దరూ సీఎం అభ్యర్థులు కావడంతో వీరిద్దరిలో ఎవరు గెలుస్తారనే చర్చ మాత్రమే జరిగింది. కౌంటింగ్ సమయంలో.. పదో రౌండ్‌ వరకు రేవంత్‌ ఆధిక్యం కొనసాగినా కూడా 11వ రౌండ్‌ నుంచి కాంగ్రెస్‌, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగానే ఈ పోటీ జరిగింది. అలా 19వ రౌండ్‌ వరకు బీజేపీ ఆధిక్యమే కొనసాగి  సైలెంట్ కిల్లర్‌గా కాటిపల్లి విజయం సాధించారు. కేసీఆర్‌, రేవంత్‌కు కాకుండా ఓటర్లు స్థానికుడైన కాటిపల్లికి పట్టం కట్టిన ఓటర్లు సంచలన తీర్పు ఇవ్వడమే ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీస్తుంది.

నిజానికి కామారెడ్డి నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీకి దిగగానే.. కావాలనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా నామినేషన్ వేశారు. దీంతో ఎన్నికల చర్చంతా ఈ ఇద్దరు నేతల చుట్టే తిరుగుతూ వచ్చింది. కానీ వీరిద్దరినీ ఓడిస్తానంటూ వెంకటరమణా రెడ్డి ముందు నుంచి చెబుతున్నా కూడా.. ఎవరూ దానిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఎన్నికల ఫలితాల్లో రేసులో పరిగెట్టిన రేవంత్ రెడ్డిని డీకొట్టి  మరీ వెంకట రమణా రెడ్డి విజయం సాధించడంతో అంతా షాక్ అయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =