26 ఏళ్ల యశస్విని చేతిలో ఓటమిపాలైన ఎర్రబెల్లి

Errabelli was defeated by 26 year old Yashaswini,Errabelli was defeated,defeated by 26 year old Yashaswini,26 year old Yashaswini,Yashaswini Reddy, congress, Palakurthy, Errabelli Dayakar Rao, BRS, Telangana Assembly elections,Mango News,Mango News Telugu,Senior Leader Errabelli Dayakara Rao,Veteran Errabelli loses seat,Yashaswini Reddy Latest News,Yashaswini Reddy Latest Updates,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Congress Latest News,Telangana Congress Latest Updates
Yashaswini Reddy, congress, Palakurthy, Errabelli Dayakar Rao, BRS, Telangana Assembly elections

ఓటమి అంటేనే తెలియని నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన చరిత్ర ఆయనది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా టీడీపీ తరుపు పోటీ చేసి దయాకర్ రావు గెలుపొందారు. రికార్డులు.. డబులు హ్యాట్రిక్ సాధించిన ఎర్రబెల్లికి ఈసారి ఓటమి తప్పలేదు.  26 ఏళ్ల యశస్విని రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే సుదీర్ఘ రాజకీయ అనుభవం.. హ్యాట్రిక్ విజయాలు.. ఓటమి అంటేనే తెలియని దయాకర్.. ఎటువంటి రాజకీయ అనుభవం లేని, 26 ఏళ్ల యువతి చేతిలో ఓటమి పాలవ్వడం సర్వత్రా చర్చనీయాంశమయింది.

తెలుగుదేశం పార్టీ ద్వారా ఎర్రబెల్లి రాజకీయ అరంగేట్రం చేశారు. 1994లో వర్థన్నపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున దయాకర్ రావు పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తొలిసారి ఎర్రబెల్లి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఎర్రబెల్లి వెనుదిరిగి చూసుకోలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 1994 నుంచి 2004 మధ్యలో జరిగిన ఎన్నికల్లో దయాకర్ రావు వర్థన్నపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. 2009లో వర్థన్నపేట నియోజకవర్గం ఎస్‌సీలకు రిజర్వ్ కావడంతో.. దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గానికి వెళ్లారు.

2009, 2014 ఎన్నికల్లో కూడా టీడీపీ తరుపున పాలకుర్తి నుంచి పోటీ చేసి ఎర్రబెల్లి గెలుపొందారు. ఆ తర్వాత 2016లో దయాకర్ రావు కారెక్కారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున పాలకుర్తి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కేసీఆర్ కేబినెట్‌లో మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. కానీ 2023లో ఎన్నికల్లో దయాకర్ రావుకు ఓటమి తప్పలేదు. యశస్వినిరెడ్డి చేతిలో ఎర్రబెల్లి ఓటమి పాలయ్యారు.

అయితే ఈసారి ఎలాగైనా ఎర్రబెల్లిని ఓడించాలని కాంగ్రెస్ ఫిక్స్ అయింది. అందుకోసం ముందుగా పాలకుర్తి నుంచి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిని బరిలోకి దింపాలనుకుంది. కానీ ఆమె ఎన్ఆర్ఐ కావడంతో.. ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని.. ఆమె కోడలు 26 ఏళ్ల యశస్విని రెడ్డిని బరిలోకి దింపారు. ఆమె బరిలో లేకపోయినప్పటికీ.. తన కోడలు విజయం కోసం ఝాన్సీ రెడ్డి తీవ్రంగా శ్రమించారు. అసలు దగ్గరుండి మరీ కోడలు యశస్విని రెడ్డిని గెలిపించుకున్నారు. ఎర్రబెల్లిని ఓడించేందుకు తెరుచుకొని ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా ముందుకు కదిలారు. చివరికి ఓటమి ఎరుగని ఎర్రబెల్లిని మట్టి కరిపించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =