రేపే సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం, కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ పై కీలక చర్చ

Coronavirus outbreak, Coronavirus Pandemic, COVID 19 India, COVID-19, Mango News, modi on coronavirus, Modi Video Conference, Modi Video Conference With All States Chief Ministers, narendra modi video conference, Novel Coronavirus, PM Modi, PM Modi to held Meeting With All CMs over COVID-19 Situation, PM Modi to interact with CMs, PM Modi To Interact With CMs Over COVID-19, PM Modi To Interact With CMs Over COVID-19 Situation, PM Modi Video Conference, PM Modi Video Conference with CMs, Prime Minister Narendra Modi, Vaccine Drive

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతుంది. మళ్ళీ భారీసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఏప్రిల్ 7, బుధవారం నాడు దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య లక్ష 15 వేలు దాటింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల‌‌ ముఖ్యమంత్రులుతో రేపు (ఏప్రిల్ 8, గురువారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి, కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, బాధితులకు వైద్యం అందుతున్న తీరు, కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం, తదితర అంశాలపై కీలకంగా చర్చించనున్నారు.

గత మార్చి 17 న సీఎంలతో సమావేశం నిర్వహించి కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై ప్రధాని మోడీ సీఎంలకు కీలక సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా రెండో వేవ్ విజృంభణ కొనసాగుతుండంతో మరోసారి సీఎంలతో సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. దేశంలో కేసులు ఎక్కువుగా నమోదవుతున్న ప్రాంతాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే లాక్‌డౌన్ ఆంక్షలు, నైట్ కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంక్షల ప్రభావం, సంబంధిత విషయాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − five =