సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలో అగ్రగామి వ్యవసాయ రాష్ట్రంగా నిలబడ్డ తెలంగాణ: మంత్రి నిరంజన్ రెడ్డి

Telangana Agriculture Minister Singireddy Niranjan Reddy Participated in SLBC Meeting at Hyderabad,Telangana Agriculture Minister Participated in SLBC Meeting,Telangana Agriculture Minister Singireddy Niranjan Reddy,SLBC Meeting at Hyderabad,Mango News,Mango News Telugu,Hyderabad SLBC Meeting Latest News,Hyderabad SLBC Meeting Live Updates,Singireddy Niranjan Reddy Latest News,Telangana Agriculture Minister Live News,SLBC Meeting News Today,Telangana Political News And Updates,Hyderabad News,Telangana Politics

హైదరాబాద్ హోటల్ మ్యారిగోల్డ్ లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో అగ్రగామి వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ నిలబడిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేళ్లలో తెలంగాణ వ్యవసాయరంగంలో బలపడింది, దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల సగటులో మొదటి స్థానానికి చేరుకున్నాం. అదే సమయంలో రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణకు శ్రీకారం చుట్టామని మంత్రి అన్నారు.

ఆయిల్ పామ్ సాగుకు బ్యాంకులు రుణాలు అందించి ప్రోత్సాహించాలి:

“పంటల వైవిధ్యీకరణలో భాగంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఆయిల్ పామ్ సాగుకు బ్యాంకులు రుణాలు అందించి ప్రోత్సాహించాలి. బ్యాంకులు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించి వాటి స్థాపన మీద దృష్టిపెట్టాలి. వాటి నుండి ప్రజలకు ఉపాధి కలిగే అవకాశాల మీద బ్యాంకులు అధ్యయనం చేయాలి. ప్రతి జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం ఇది వరకే దృష్టిపెట్టింది. డైరీ రంగాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. అందుకుగాను బ్యాంకులు డైరీ రంగం మీద అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధంగా సహకరించాలి. బ్యాంకులు కేవలం పట్టణాలలోని ఆస్తులు, భూములనే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఇచ్చే విదేశీ విద్య బ్యాంకు రుణాల గరిష్ట పరిమితి రూ.7.5 లక్షల నుంచి పెంచాలి. గత తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల భూముల ధరలు భారీగా పెరిగాయి, కాబట్టి వాటిని కూడా బ్యాంకర్లు పరిగణనలోకి తీసుకోవాలి” అని మంత్రి సూచించారు.

బ్యాంకులు రుణాల విషయంలో మరింత ఉదారంగా వ్యవహరించాలి:

“వేరుశెనగ పంట ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో వినియోగించే పీనట్ బట్టర్ కు డిమాండ్ ఉన్నది. కానీ అక్కడ వేరుశెనగ పంట పండదు. నాణ్యమైన వేరుశెనగ ఉత్పత్తులకు తెలంగాణ అనువైన ప్రాంతం. అందులో దక్షిణ తెలంగాణ మరింత అనుకూలం. అటువంటి పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకులు ప్రోత్సాహం అందిస్తే రైతులకు మేలు జరుగుతుంది. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించడానికి క్షేత్రస్థాయి అవకాశాలను పారిశ్రామికవేత్తలే కాకుండా బ్యాంకులు కూడా పరిశీలించాలి. 2022-23 సంవత్సరానికి గాను వ్యవసాయ రంగానికి బ్యాంకులు ఇచ్చే రుణాలు పెట్టుకున్న లక్ష్యంలో 62 శాతమే చేరుకున్నారు. బ్యాంకులు ఈ రుణాల విషయంలో మరింత ఉదారంగా వ్యవహరించాలి” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్, ఎస్ఎల్బీసీ అధ్యక్షులు అమిత్ జింగ్రాన్, జీఎం నాబార్డ్ డాక్టర్ వై.హరగోపాల్, ఆర్బీఐ డీజీఎం కేఎస్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =