తెలంగాణ శాసనసభలో జీఎస్టీ, ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ సహా 8 కీలక బిల్లులకు ఆమోదం

Telangana Assembly Session Approves 8 Bills Including Telangana GST Private Universities Amendment Bills, Telangana Assembly Session, Approves 8 Bills In Telangana Assembly, GST Amendment Bill, Private Universities Amendment Bill, Mango News, Mango News Telugu, GST and FRBM Amendment Bills, FRBM Amendment Bill, Varsity Recruitment, Telangana Legislature Assembly, Telangana Mansoon Session, GST Bill, Telangana GST Bill, Telangana Assembly Session Live Updates

తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాలు కొనసాగుతున్నాయి. మంగ‌ళ‌వారం జరుగుతున్నసమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎనిమిది బిల్లులను సభలో ప్రవేశపెట్టగా, సభ ఆమోదం తెలిపింది. జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, జీహెచ్‌ఎంసీ, తెలంగాణ పురపాలక చట్ట సవరణ, తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు, ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ మోటార్ వెహికల్ టాక్సేషన్ సవరణ బిల్లు, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా (టర్మినేషన్ అండ్ ల్యాండ్ రెగ్యులేషన్ అఫ్ లిజ్) బిల్లు, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ అండ్ సూపర్ న్యూఎషన్) సవరణ బిల్లు మరియు ఫారెస్ట్రీ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లులను రాష్ట్రమంత్రులు సభలో ప్రవేశపెట్టారు.

ఈ చట్టాల సవరణ బిల్లులు, కొత్త బిల్లులపై చర్చించిన అనంతరం, ఈ ఎనిమిది బిల్లుల‌కు శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బిల్లుల ఆమోదంపై స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టన చేశారు. మరోవైపు శాసనసభలో ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందడంతో రాష్ట్రంలో శ్రీనిధి, గురునానక్, ఎంఎన్ఆర్, నిక్‌మార్, కావేరి వ్యవసాయ వంటి ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి వచ్చినట్లయింది. కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల్లో 25 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు రిజర్వేషన్ కల్పించేలా ఓ నిబంధనను కూడా పొందుపరిచారు. శాసనసభలో ఆమోదం పొందడంతో ఈ బిల్లులన్నింటినీ ఆమోదం కోసం శాసనమండలిలో కూడా ప్రవేశపెట్టనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − ten =