సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం తీవ్ర విచారకరం – జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Responds over Blaze Mishap at Secunderabad, Janasena Chief Pawan Kalyan , Pawan Kalyan Reacts on Secunderabad Fire Accident, 6 People KIlled in Secunderabad Fire Accident, Fire Breakout in Secunderabad Hotel, 6 People Killed in Fire Accident, Fire Breaks Out At Hotel Building, Mango News, Telangana Fire at Secunderabad Hotel, Fire Breaks Out At Ruby Hotel, Ruby Hotel Secunderabad, Ruby Hotel Fire Accident, Ruby Hotel Latest News And Updates, Secunderabad Fire Breakout News And LIve Updates

సికింద్రాబాద్‌ లో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పాస్‌పోర్టు ఆఫీస్ సమీపంలోని రూబీ ప్రైడ్ లగ్జరీ హోటల్‌ భవనం కింది అంతస్తులో ఉన్న ఇ-బైక్ షోరూమ్‌లోని స్కూటర్ రీచార్జింగ్ యూనిట్‌లో మంటలు చెలరేగడంతో, మొదటి అంతస్తుకు పొగ వ్యాపించి ఊపిరి ఆడక లాడ్జిలో వసతి పొందుతున్న ఎనిమిది మంది పర్యాటకులు మృతి చెందారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం తీవ్ర విచారకరం అని పేర్కొన్నారు. ఈ మేరకు అయన ఒక ప్రకటన విడుదల చేశారు.

“సికింద్రాబాద్ లోని ఓ హోటల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యటకులు ఈ విధంగా ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. అగ్ని ప్రమాదంలో పలువురు క్షతగాత్రులయ్యారని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందింది. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాను. పర్యటకంగా, వాణిజ్యపరంగా, ఐటీ రంగంలో ముందుకు వెళ్తున్న తెలంగాణ రాజధానిలో ఇటువంటి ప్రమాదాలకు తావు లేకుండా హోటల్స్, బహుళ అంతస్తుల భవనాల్లో ఎప్పటికప్పుడు అగ్ని మాపక, ఇతర రక్షణ తనిఖీలు చేయించాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు సూచిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మరోవైపు సికింద్రాబాద్ లో జరిగిన అగ్నిప్ర‌మాద ఘ‌ట‌నపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు మూడు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను తెలంగాణ ప్రభుత్వం తరపున అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =