టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై గన్‌పార్క్‌ వద్ద బీజేపీ ఆందోళన.. బండి సంజయ్, ఈటల రాజేందర్ అరెస్ట్

Telangana BJP Chief Bandi Sanjay and MLA Etala Rajender Arrested at Gunpark During Agitation on TSPSC Paper Leakage Issue,Telangana BJP Chief Bandi Sanjay Arrested,Eatala Rajender Arrested,BJP Members Arrested at Gunpark,BJP Members on TSPSC Paper Leakage Issue,Mango News,Mango News Telugu,Bandi Sanjay Arrested,Telangana BJP Chief Bandi Sanjay Kumar,Telangana BJP Member Eatala Rajender Arrested,BJP MLA Eatala Rajender Latest News,BJPs Telangana chief Bandi Sanjay News,Telangana BJP Chief Latest Updates,BJP Member Eatala Rajender Latest Updates,TSPSC Question Paper Leak Case,TSPSC Paper Leak Scam,TSPSC Question Papers Leakage Issue

తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ప్రతిపక్షాలు సహా విద్యార్థి సంఘాలు దీనిపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్థూపం (గన్‌పార్క్‌) వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరియు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా శ్రేణులతో కలిసి పెద్దపెట్టున నినాదాలు చేశారు.

అయితే వీరి నిరసనకు పోలీసులు అడ్డు చెప్పారు. ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతున్నందున కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరారు. కానీ అందుకు బండి సంజయ్ ఒప్పుకోకపోవడంతో ఆయనను అరెస్ట్ చేసి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో గన్‌పార్క్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో గన్ పార్క్ వద్ద భారీగా పోలీసులు మోహరించి బండి సంజయ్‎ మరియు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను బలవంతంగా వాహనం ఎక్కించి అక్కడినుంచి తరలించారు. ఇక ఇదిలా ఉండగా అంతకుముందు లోటస్ పాండ్ లోని సొంత నివాసంలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 11 =