టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీపై పలువురు మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు

Several AP Ministers Interesting Comments Over The Meeting of TDP President Chandrababu and Janasena Chief Pawan Kalyan,Janasena Chief Pawan Kalyan,Meets TDP President Chandrababu Naidu,Discusses Political Topics,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates,AP BJP Party

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్‌ కల్యాణ్‌లు ఆదివారం భేటీ అయిన విషయం తెలిసిందే. ఇది రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయయాంశం అయింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి తాము కలిసి పనిచేయడానికి ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా వారిరువురూ మీడియా సమేవేశంలో ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం తమ రెండు పార్టీలను లక్ష్యంగా చేసుకుని బహిరంగ సభలు మరియు రోడ్‌షోల నిషేధానికి సంబంధించి జీవో తెచ్చిందని వారు ఆరోపించారు. అంతేకాకుండా ఇప్పుడు ఏపీ ఎమర్జెన్సీ కంటే అధ్వాన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని ఉమ్మడి ప్రకటన చేశారు. ఇక ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీపై అధికార వైసీపీకి చెందిన పలువురు మంత్రులు, నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీపై పలువురు వైసీపీ మంత్రులు, నేతల ఆసక్తికర వ్యాఖ్యలు..

  • విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రుల మీద దాడి చేస్తే.. చంద్రబాబు వెళ్లి పవన్‌ను పరామర్శిస్తారని, అలాగే ఆయన సభల్లో తొక్కిసలాటలు జరిగి ప్రజలు మరణిస్తుంటే పవన్ కళ్యాణ్ వెళ్లి చంద్రబాబును పరామర్శించడం వారి మధ్య అవగాహనకు నిదర్శనం మంత్రి ఆర్కే రోజా.
  • పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్ళింది వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే సీట్లపై మాట్లాడుకోవడానికేనని, చంద్రబాబు ఏం చెబితే అది చేస్తానని చెప్పడానికే – మంత్రి ఆదిమూలపు సురేష్.
  • పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని టీడీపీకి బీ టీమ్ లెక్క తయారు చేశారని, వీరిద్దరూ వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తారని తాము మొదటినుంచి చెప్తున్నామని, అదే నిజమైంది. ఇప్పటికైనా వారు తమ ముసుగుని తొలగించాలి – మంత్రి అంబటి రాంబాబు.
  • చంద్రబాబు సభలలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను కలిసి పరామర్శించకుండా, చంద్రబాబుని కలవడం ఏంటని ప్రశ్నించారు. ఒకవైపు బీజేపీతో పొత్తు అంటూనే.. పవన్ మరోవైపు టీడీపీకి మద్దతు తెలపడం ప్యాకేజీ కోసమే – ఎంపీ మార్గాని భరత్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − ten =