రాయలసీమ రతనాల సీమగా మారడానికి సహకరిస్తా

#KCR, AP News, CM KCR, CM KCR Press Meet At Nagari, cm kcr speech, KCR About Nagari MLA Roja, KCR About Rayalaseema Development, KCR About Roja, KCR Press Meet At Nagari, Mango News Telugu, MLA Roja, Nagari, Nagari Constituency, Nagari MLA Roja, political news, telangana, Telangana CM KCR, Telangana CM KCR Press Meet, Telangana CM KCR Press Meet At Nagari, Telangana News, telugu news, TRS

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు లోని కాంచీపురంలో అత్తివరదరాజస్వామిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో నగరి పట్టణంలో ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు యువనాయకుడు, పట్టుదలతో పనిచేసే వై.ఎస్ జగన్ సీఎంగా ఉన్నారు, ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి పరస్పరం సహకరంతో కృషి చేస్తున్నాం, ప్రజల మద్దతు ఉన్నంతకాలం రెండు రాష్ట్రాల్లో ప్రజల కోరికలు నెరవేరేలా చూస్తామని తెలిపారు.

చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించేలా ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో కలిసి పనిచేస్తామని కేసీఆర్ చెప్పారు. రాయలసీమ అభివృద్ధి చెందడానికి, ఆర్థికంగా ఎదగడానికి గోదావరి జలాలు రావాల్సిన అవసరముందని, రాయల సీమను రతనాల సీమగా మార్చడానికి అన్ని విధాలుగా సహకరిస్తామని అన్నారు. గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలవకుండా 1000 టీఎంసీల నీటిని రాయలసీమకు మళ్లించాలనే ఆశయంతోనే పనిచేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాటు ఆర్కే రోజా, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు ఉన్నారు.

 

[subscribe]
[youtube_video videoid=_NEBWkl0S0c]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − twelve =