తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1550 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 13, సోమవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 36,221 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 11,525 శాంపిల్స్ పరీక్షించగా 9,975 మందికి నెగటివ్ వచ్చినట్టుగా పేర్కొన్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 926, రంగారెడ్డిలో 212, కరీంనగర్ లో 86, మేడ్చల్ లో 53, నల్గొండలో 41, ఖమ్మం లో 38, కామారెడ్డిలో 33, సంగారెడ్డిలో 19, వరంగల్ అర్బన్ లో 16, మహబూబ్ నగర్ లో 13, మహబూబాబాద్ లో 13, జనగామలో 10, సిద్దిపేటలో 10, సూర్యాపేటలో 10, భద్రాద్రి కొత్తగూడెంలో 10 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (జూలై 13, సాయంత్రం 5 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 36,221
- కొత్తగా నమోదైన కేసులు (జూలై 12 – జూలై 13 (5PM-5PM) : 1550
- నమోదైన మరణాలు : 9
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 23,679
- యాక్టీవ్ కేసులు : 12,178
- మొత్తం మరణాల సంఖ్య : 365
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu