తెలంగాణలో మరో 1590 కరోనా కేసులు, 7 మరణాలు నమోదు

Telangana Covid-19 Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases

తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జూలై 5, ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 23,902 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఆదివారం నాడు 5,290 శాంపిల్స్ పరీక్షించగా 3700 మందికి నెగటివ్ వచ్చినట్టుగా పేర్కొన్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1277, మేడ్చల్ లో 125, రంగారెడ్డిలో 82, సూర్యాపేటలో 23, మహబూబ్ నగర్ లో 19, సంగారెడ్డిలో 19, నల్గొండలో 14 నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (జూలై 5, సాయంత్రం 5 గంటల వరకు) :

రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 23902
కొత్తగా నమోదైన కేసులు (జూలై 4- జూలై 5 (5PM-5PM) : 1590
నమోదైన మరణాలు : 7
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 12703
యాక్టీవ్ కేసులు : 10904
మొత్తం మరణాల సంఖ్య : 295

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =