భారత్ నుండి భూటాన్, మాల్దీవులు సహా 6 దేశాలకు కరోనా వ్యాక్సిన్ సరఫరా

al Corona Vaccination, Corona Vaccination Drive, Corona Vaccination Programme, coronavirus vaccine distribution, covid 19 vaccine, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Distribution For Covid-19 Vaccine, India To Supply COVID-19 Vaccines To Six Countries, India To Supply COVID-19 Vaccines To Six Countries From Today, Mango News, Vaccine Distribution

భారత్ లో అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పొరుగు మరియు ముఖ్య భాగస్వామి దేశాలకు కూడా దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. పొరుగు దేశాల నుంచి దేశంలో తయారైన వ్యాక్సిన్ల సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే అనేక అభ్యర్థనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ అభ్యర్ధనలకు స్పందిస్తూ, కరోనా మహమ్మారిపై పోరాటంలో ఇతర దేశాలకు సహాయపడేందుకు కరోనా వ్యాక్సిన్ల పంపిణీకి కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ మరియు సీషెల్స్ వంటి ఆరు దేశాలకు గ్రాంట్ సహాయంతో బుధవారం నుండే కరోనా వ్యాక్సిన్ల సరఫరాను ప్రారంభించారు. ఇక శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మరియు మారిషస్‌ దేశాలకు సంబంధించి అవసరమైన నియంత్రణ అనుమతుల నిర్ధారణ కోసం వేచి చూస్తున్నట్టు కేంద్రం తెలిపింది.

దేశీయ అవసరాలకు సరిపడా తగినన్ని కరోనా వ్యాక్సిన్ నిల్వలు ఉండేలా చూస్తారని, ఆతర్వాతనే విదేశాలకు కరోనా వ్యాక్సిన్ సరఫరా చేయడానికి దేశీయ సంస్థలు నిర్ణయం తీసుకుంటాయని పేర్కొన్నారు. ఇక బుధవారం నాడు ముందుగా సీరం ఇనిస్టిట్యూట్‌ ఇండియా తయారు చేసిన ‘కొవిషీల్డ్‌’ కరోనా వ్యాక్సిన్ 1.5 లక్షల డోసులను భూటాన్ కు, అలాగే లక్ష డోసులను మాల్దీవులకు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తరలించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 2 =