రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఫలితాలపై ప్రగతి నివేదికలను సిద్దం చేయాలి: సీఎస్

Mango News, Niti Aayog Meeting, Progress Reports ahead of Niti Aayog Meeting, Somesh Kumar, State Progress Reports ahead of Niti Aayog Meeting, Telangana CS, Telangana CS Asks Officials to Make State Progress Reports, Telangana CS Somesh Kumar, Telangana News, Telangana Niti Aayog Meeting, Telangana Political News, Telangana Political Updates

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఫిబ్రవరి 20న నీతి ఆయోగ్ ఆరవ పాలక మండలి సమావేశం జరగనుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలలో సాధించిన విజయాలను తెలుపుతూ సంక్షిప్త నివేదికలను సిద్దం చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సీఎస్ సంబంధిత అధికారులతో జరిపిన సమావేశంలో ఆ నివేదికను ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు సమర్పించాల్సి వుందన్నారు.

నీతి ఆయోగ్ ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలలో సాధించిన ఫలితాలపై ప్రగతి నివేదికలను సిద్దం చేయాలని, సీఎం కేసీఆర్ ఆశయాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు మరియు విధానాలను ఆ నివేదికలలో పేర్కొనాలని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. నీతి ఆయోగ్ కోరిన విధంగా రాష్ట్రంలో విజయవంతంగా అమలు అవుతున్న టిఎస్ ఐ-పాస్, కేసీఆర్ కిట్స్, రైతు బంధు మరియు రైతు భీమా పథకాలను ఆ నివేదికలలో చేర్చాలని సూచించారు.

ఈ సమావేశంలో కార్మిక, ఉపాది శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, ఐటి ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ , సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ నవీన్ మిత్తల్ , గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు మహిళా,శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 1 =