84 గ్రామాల్లో సమగ్ర అభివృద్ధికై జీవో 69 అమలుపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష

Telangana CS Somesh Kumar Held Meeting with Officials Over Implementation of GO 69, CS Somesh Kumar Held Meeting with Officials Over Implementation of GO 69, Implementation of GO 69, GO 69, Telangana CS Somesh Kumar, Telangana CS, Somesh Kumar, Telangana Chief Secretary, Telangana Chief Secretary Somesh Kumar, Telangana Chief Secretary Somesh Kumar Held Meeting with Officials Over Implementation of GO 69, Telangana CS Somesh Kumar Held Meeting with Officials, Telangana Chief Secretary Somesh Kumar Held Meeting with Officials, GO 69 News, GO 69 Latest News, GO 69 Latest Updates, GO 69 Live Updates, Telangana, Mango News, Mango News Telugu,

హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల పరివాహక ప్రాంతానికి సంబంధించి అమల్లో ఉన్న జీవో నెంబర్ 111 ప‌రిధిలో గల 84 గ్రామాల్లో ఆంక్ష‌లను ఎత్తివేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఆంక్షలను ఎత్తివేతపై రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ జీవో 69ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆ 84 గ్రామాల సమగ్ర అభివృద్ధికి సంబంధించిన జీవో 69 అమలుపై సంబంధిత అధికారులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం బీ.ఆర్‌.కే.ఆర్‌ భవన్‌లో సమావేశం నిర్వహించారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచనల మేరకు మొత్తం ప్రాంతాన్ని గ్రీన్ బఫర్ జోన్‌లుగా అభివృద్ధి చేయుటలో భాగంగా జలవనరుల సంరక్షణ, కాలుష్య నియంత్రణ, హై ఎఫిషియెన్సీ ఎస్టీపీలు ఏర్పాటు, మౌళికవసతుల కల్పన, వ్యవస్థాపరమైన నిర్వహణ ఏర్పాటుపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ , ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ యం.డి. దాన కిషోర్, టీఎస్ పీఎస్బీ సభ్య కార్యదర్శి నీతూప్రసాద్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, హెఛ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్ బాలకృష్ణ, జీహెఛ్ఎంసీ సీసీపీ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 1 =