డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు ఆగస్టులో జరిగే అవకాశం?

2020, Degree, Degree and PG Exams, Degree exams likely to start, degree exams News, Degree Online Services, Latest News on degree exams, Telangana Degree Exams, Telangana Degree Exams 2020, Telangana Degree PG Exams, Telangana PG Exams

యూనివర్సిటీల పరీక్షలు మరియు అకాడమిక్ క్యాలెండర్ పై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నూతన మార్గదర్శకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా డిగ్రీ, పీజీ సహా పలు ఇతర కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలను సెప్టెంబర్ నెల చివరికల్లా నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల పరీక్షలను నిర్వహించే పక్షంలో కనీసం రెండు మూడు వారాల ముందు షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఆగస్టు నెలలో పరీక్షలు జరిపే అవకాశమునట్టు సమాచారం. అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులకు చివరి సెమిస్టర్ లో మూడు పరీక్షలే ఉండడంతో వీలైనంత త్వరగా ముందు వాటిని పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలనీ చూస్తున్నారు.

పరీక్షల నిర్వహణపై తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి మంగళవారం నాడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించారు. త్వరలోనే అన్ని యూనివర్సిటీల కన్వీనర్ లతో సమావేశమై పరీక్షల షెడ్యూల్ పై చర్చించనున్నారు. మరోవైపు యూనివర్సిటీలు నిర్వహించే పరీక్షలకు చివరి సంవత్సరం విద్యార్థులు హాజరు కాలేకపోతే, అలాంటి వారికీ ప్రత్యేకంగా మరోసారి పరీక్షలు నిర్వహించాలని యూజీసీ నూతన మార్గదర్శకాల్లో పేర్కొంది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − fifteen =