తెలంగాణలో మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు, మే 12 నుంచి వెబ్‌సైట్ లో కూడా హాల్ టికెట్స్ అందుబాటు

Telangana Download Hall Tickets for SSC Public Exams-2022 on Official Website from May 12, Download Hall Tickets for SSC Public Exams-2022 on Official Website from May 12, SSC Public Exams-2022 on Official Website from May 12, Download Hall Tickets for SSC Public Exams-2022 on Official Website, Students will be able to find out the exam timings and dates after downloading the telangana ssc hall ticket 2022 from the official website, telangana ssc hall ticket 2022, SSC Public Exams-2022, 2022 SSC Public Exams, Telangana SSC Public Exams-2022, TS SSC Hall Ticket 2022, Download TS SSC Hall Tickets 2022 online, TS 10th class Hall Tickets 2022, SSC Public Examinations starting May 23, SSC Public Examinations News, SSC Public Examinations Latest News, SSC Public Examinations Latest Updates, SSC Public Examinations Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి-2022 పరీక్షలను మే 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షలను నిర్దేశించిన తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం 5,09,275 మంది విద్యార్థులు హాజరకానున్నారు. ఈ నేపథ్యంలో హాల్ టికెట్స్ అంశంపై ఎస్ఎస్సీ బోర్డు (డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్జామినేషన్స్ తెలంగాణ) తాజాగా కీలక ప్రకటన చేసింది.

హాల్-టికెట్లు మరియు ప్రింటెడ్ నామినల్ రోల్స్ నేడు (మే 11, బుధవారం) రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు పంపబడ్డాయని, విద్యార్థులు తమ హాల్-టికెట్లను సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్ నుండి తీసుకోవాలని సూచించారు. అలాగే మే 12నుండి హాల్ టికెట్స్ www.bse.telangana.gov.in వెబ్‌సైట్ లో కూడా అందుబాటులో ఉంటాయన్నారు. మే-2022 పదో పబ్లిక్ పరీక్షలకు హాజరు కావడానికి ఈ వెబ్‌సైట్ నుండి కూడా విద్యార్థులు తమ హాల్-టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =