డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ 2021-22 అడ్మిషన్ పక్రియ విడుదల

Degree Online Services, DOST, Dost 2020-21 Notification, DOST 2021, Dost degree admission 2021-2022, DOST Telangana Admission, DOST Telangana Admission 2021, Mango News, Telangana DOST 2021 notification, Telangana State Council of Higher Education, TS DOST Notification 2020 New Schedule Released, TSCHE, TSCHE DOST 2020, TSCHE Released Dost 2020-21 Notification, TSCHE Released Dost 2020-21 Notification Today

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో బి.ఏ, బిఎస్సీ, బికాం, బిబిఏ, బిసిఏ, బిబిఎం సహా పలు కోర్సులలో ప్రవేశాలు కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్ విడుదలైంది. 2021-22 సంవత్సరానికి గానూ దోస్త్ నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి జూన్ 29, మంగళవారం నాడు విడుదల చేసింది. జూలై 1 వ తేదీ నుంచి జూలై 15 వ తేదీ వరకు ఫేజ్-1 రిజిస్ట్రేషన్లు జరుగుతాయని దోస్త్‌ కన్వీనర్ ఆర్‌.లింబాద్రి ప్రకటించారు.

దోస్త్ 2021-22 అడ్మిషన్ షెడ్యూల్ :

 • నోటిఫికేషన్ విడుదల: జూన్ 29, 2021
 • ఫేజ్-1 దోస్త్ రిజిస్ట్రేషన్లు(రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200) : జూలై 1 నుంచి జూలై 15 వరకు
 • వెబ్ ఆప్షన్ల నమోదు – జూలై 3 నుంచి జూలై 16 వరకు
 • స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ – జూలై 13, 14
 • ఫేజ్-1 డిగ్రీ సీట్ల కేటాయింపు – జూలై 22
 • ఫేజ్ -1 విద్యార్థులకు ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ (కళాశాల ఫీజు/సీటు రిజర్వేషన్ ఫీజు ఆన్‌లైన్ చెల్లింపు ద్వారా) (అవసరమైన విద్యార్థులకు) – జూలై 23 నుంచి 27 వరకు
 • ఫేజ్ -2 దోస్త్ రిజిస్ట్రేషన్లు (రిజిస్ట్రేషన్ ఫీజు రూ.400) – జూలై 23 నుంచి జూలై 27 వరకు
 • ఫేజ్ -2 వెబ్ ఆప్షన్ల నమోదు – జూలై 24 నుంచి జూలై 29 వరకు
 • ఫేజ్-2 స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ – జూలై 26
 • ఫేజ్-2 డిగ్రీ సీట్ల కేటాయింపు – ఆగస్టు 4
 • ఫేజ్-2 విద్యార్థులకు ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ – ఆగస్టు 5 నుంచి ఆగస్టు 10 వరకు
 • ఫేజ్-3 దోస్త్ రిజిస్ట్రేషన్లు (రిజిస్ట్రేషన్ ఫీజు రూ.400) : ఆగస్టు 5 నుంచి ఆగస్టు 10 వరకు
 • ఫేజ్-3 వెబ్ ఆప్షన్ల నమోదు – ఆగస్టు 6 నుంచి ఆగస్టు 11 వరకు
 • ఫేజ్-3 స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ – ఆగష్టు 9
 • ఫేజ్-3 డిగ్రీ సీట్ల కేటాయింపు – ఆగస్టు 18
 • ఫేజ్-3 విద్యార్థులకు ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ – ఆగస్టు 18 నుంచి ఆగస్టు 19 వరకు
 • కాలేజీలో రిపోర్టింగ్ (ఫేజ్-1, 2,3 లలో ఇప్పటికే ఆన్‌లైన్‌లో (సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా) తమ సీట్లను ధృవీకరించిన విద్యార్థులు కళాశాలలకు రిపోర్టింగ్ చేయాలి) – ఆగస్టు 18 నుంచి ఆగస్టు 21 వరకు
 • ఓరియెంటేషన్ – ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు
 • తరగతులు ప్రారంభం – సెప్టెంబర్ 1 నుంచి

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here