విద్యుత్ ఉద్యోగులు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనాలి: మంత్రి జగదీష్ రెడ్డి

Telangana Energy Minister Jagadish Reddy held Special Review Meeting with Officials

రాష్ట్రంలో జరుగుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో విద్యుత్ ఉద్యోగులు విధిగా పాల్గొనాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశించారు. వానాకాలం పంటలతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ లకు అవసరమయ్యే విద్యుత్ పై సోమవారం సాయంత్రం మింట్ కాంపౌండ్ లోని తన ఛాంబర్ లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయ, ట్రాన్స్కో అండ్ జెన్కో సిఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, టీఎస్ఎస్పిడిసిఎల్ సిఎండీ రఘుమారెడ్డి, తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. వానాకాలంలో విద్యుత్ సిబ్బంది, ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఆయన ప్రత్యేక సూచనలు చేశారు. వ్యవసాయ అవసరాలకు కావాల్సిన విద్యుత్ కనెక్షన్లు దరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ్రోకెన్ పోల్స్ తో పాటుగా, అవరోదంగా నిలుస్తూ వేలాడుతున్న తీగలను సత్వరమే తొలగించాలని, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞాపనలను పరిగణలోకి తీసుకోవాలని మంత్రి సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − three =